'సవ్యసాచి' నుండి తొలి పాట.. ఎప్పుడంటే..?

By Udayavani DhuliFirst Published Oct 5, 2018, 4:39 PM IST
Highlights

అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న 'సవ్యసాచి' సినిమా టీజర్ ని ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న 'సవ్యసాచి' సినిమా టీజర్ ని ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిపోయింది. యూట్యూబ్ లో యాభై లక్షల వ్యూస్ ని దక్కించుకుంది టీజర్.

రెండు చేతుల‌తోనూ ఒకే బ‌లం చూపించే స‌వ్య‌దిశ వ్య‌క్తిగా చైతూ  న‌టిస్తున్నారు. మ‌హాభారతంలో అర్జునుడికి మాత్ర‌మే ఉన్న శ‌క్తి ఇది. తెలుగులో ఇప్పటివరకు రాని సరికొత్త కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందు మొండేటి.  

ఇప్పుడు ఈ సినిమాలో మొదటి పాటను విడుదల చేయబోతుంది చిత్రబృందం. అక్టోబ‌ర్ 9న ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో విడుద‌ల కానుంది. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానుంది. నవంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకొని పుడితే.. 'సవ్యసాచి' టీజర్!

సవ్యసాచి లో నాగ్ సెంటిమెంట్!
 

click me!