యాసిడ్ దాడికి గురైన అమ్మాయి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ!

Published : Oct 05, 2018, 04:20 PM IST
యాసిడ్ దాడికి గురైన అమ్మాయి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ!

సారాంశం

గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ పద్మావత్ హీరోయిన్ ఒక యాసిడ్ దాడికి గురైన అమ్మాయి పాత్రలో నటించడానికి రెడీ అయ్యింది. రాజి సినిమాతో దర్శకురాలిగా మంచి ప్రశంసలు అందుకున్న మేఘన గుల్జర్ ఆ సినిమాను తెరకెక్కించనున్నారు. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దీపిక పడుకొనే రెగ్యులర్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. జనాలను ఆకట్టుకునే విధంగా పాత్రలను చేస్తూ మెప్పిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ పద్మావత్ హీరోయిన్ ఒక యాసిడ్ దాడికి గురైన అమ్మాయి పాత్రలో నటించడానికి రెడీ అయ్యింది. 

రాజి సినిమాతో దర్శకురాలిగా మంచి ప్రశంసలు అందుకున్న మేఘన గుల్జర్ ఆ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇకపోతే దీపిక సొంతంగా తన సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. యాసిడ్ దాడికి గురైన  లక్ష్మి అగర్వాల్ పాత్రను ఆధారంగా చేసుకొని సినిమా కథ ఉంటుందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. 

ముంబైకి చెందిన లక్ష్మి అగర్వాల్ 2005లో 15 ఏళ్ల వయసులో యాసిడ్ దాడికి గురైంది. తనను ప్రేమించలేదని నయీమ్ ఖాన్ అనే వ్యక్తి లక్ష్మిపై యాసిడ్ దాడి చేశాడు. అయితే ఎంతో మనోవేధనలో కూడా లక్ష్మి దైర్యంగా నిలబడి కొత్త తరహాలో జీవితాన్ని గెలిచి అందరికి ఆదర్శంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె యాసిడ్ ఘటనలు జరగకూడదని ప్రచారాలను మీటింగ్ లను నిర్వహించి యాసిడ్ బాధితులకు సైతం అండగా నిలిచింది.

PREV
click me!

Recommended Stories

RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న