
శైలజా రెడ్డి అల్లుడు తో గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని నాగచైతన్య పెద్దగా మెప్పించలేకపోయాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఊహించని విధమైన రిజల్ట్ అందుకుంది. దీంతో నెక్స్ట్ సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని నాగ చైతన్య కష్టపడుతున్నాడు. చందు మొండేటి డైరెక్షన్ లో సవ్యసాచి అనే సినిమా చేసిన చైతు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఆ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా చైతు సినిమాలో విభిన్నమైన క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఒక శరీరంలో రెండు క్యారెక్టర్స్ అనే పాయింట్ తో రానున్న సవ్యసాచి నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు మ్యాటర్ లోకి వెళితే రేపు సినిమా మొదటి సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.
వై నాట్ అనే అనే ఆ సాంగ్ ను కీరవాణి స్వరపరిచారు. ఆయనే సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హై లెవెల్లో ఉంటుందని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది. ఇక మంగళవారం ఉదయం 11గంటలకు పాటను విడుదల చేసి సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా చైతు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.