నటనైనా, జీవితమైనా మా ఆచార్య మెగాస్టారే : సత్యదేవ్.. ‘గాడ్ ఫాదర్’లో పవర్ ఫుల్ రోల్..

Published : Apr 28, 2022, 02:22 PM ISTUpdated : Apr 28, 2022, 02:38 PM IST
నటనైనా, జీవితమైనా మా ఆచార్య మెగాస్టారే : సత్యదేవ్.. ‘గాడ్ ఫాదర్’లో పవర్ ఫుల్ రోల్..

సారాంశం

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satyadev) విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందుకు మెగాస్టార్ కు, చిత్ర నిర్మాణ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గ్రాండ్ టు ఎర్త్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. షార్ట్ ఫిల్మ్ యాక్టర్ గా కేరీర్ ను స్టార్ చేసిన సత్యదేవ్ తన ప్రతిభను బయటపెడుతూ తెలుగు చలన చిత్ర రంగంలో ఒక్కోమెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. తొలుత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’తో బిగ్ స్క్రీన్ పై కనిపించాడు. ఆ తర్వాత వరుస చిత్రాల్లో వచ్చిన క్యారెక్టర్ బేస్డ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ హీరోగా ఎదిగాడు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 

అయితే, యంగ్ హీరో, చాలా మంది ఆర్టిస్టులకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఎంతటి చిన్నపాత్రలోనైనా కనిపించాలనే కోరిక ఉంటుంది. సత్యదేవ్ కూడా చిరు (Chiranjeevi) సినిమాలో కనిపించాలని ఎంతగానో ప్రయత్నించాడు. ఎట్టకేళలకు మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ (God Father)తో ఆ కోరిక తీరింది. ఈ చిత్రంలో సత్యదేవ్ ఓ పవర్ ఫుల్ రోల్ లో నటించారు. ఈ సందర్భంగా మెగస్టార్ చిరంజీవి, నిర్మాణ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 

ట్వీట్ లో.. ‘అన్నయ్య..  నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు గాడ్ ఫాదర్ సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే  అవకాశం దక్కింది.’ అని పేర్కొన్నారు. దీంతో సత్యదేవ్ అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం, గాడ్సే, రామ్ సేతు’ చిత్రాల్లో నటిస్తున్నారు.

మలయాళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘లూసీఫర్’ రీమేక్ గా తెలుగులో వస్తున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. హీరోయిన్ నయన తార (Nayanathara) చిరు సరసన ఆడిపాడనుంది. ఇప్పటికే  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సత్యదేవ్ కూడా నటించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకున్న రానున్నట్టు తెలుస్తోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?