సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసిన శశికళ... రాజకీయవర్గాల్లో కొత్త చర్చ!

By team teluguFirst Published Dec 7, 2021, 6:48 PM IST
Highlights


తమిళనాడు రాజకీయ సంచలనం, దివంగత సీఎం జయలలిత ప్రియ సఖి శశికళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలవడం ఆసక్తికరంగా మారింది. రజినీకాంత్, శశికళ మీటింగ్ రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. 
 

2016 లో జయలలిత (Jayalalita) మరణం అనంతరం అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళ చేతికొచ్చాయి. సీఎంగా కొనసాగుతున్న ఓ. పన్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించి.. పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం ప్రమాణానికి శశికళ సిద్ధమయ్యారు. అక్రమాస్తుల కేసు తీర్పు కొద్దిరోజుల్లో వెలువడనుండగా... గవర్నర్ ఆమె సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని హోల్డ్ లో ఉంచారు. 2017 ఫిబ్రవరి 14న నాలుగు సంవత్సరాల శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సీఎం పీఠం ఎక్కాల్సిన శశికళ బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలుకు ఖైదీగా వెళ్లారు. 


శశికళ (Sasikala) వెళుతూ వెళుతూ తనకు అనుకూలంగా ఉండే పళని స్వామిని సీఎం చైర్ లో కూర్చోబెట్టి వెళ్లారు. పన్నీరు సెల్వంతో కలిసిపోయిన పళని స్వామి ఆమెకు హ్యాండ్ ఇవ్వడం జరిగింది. చివరికి అన్నాడీఎంకే పార్టీపై ఆమె పట్టుకోల్పోయారు. కోర్టులో పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. రెండాకులు గుర్తు మాదే అంటూ ఆమె న్యాయపోరాటం చేసినా ఫలితం దక్కలేదు. శశికళ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం అనే కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. 


అన్నాడీఎంకే పార్టీలోని వర్గ పోరాటం ప్రత్యర్థి డీఎంకే పార్టీకి కలిసొచ్చింది. ప్రజలు స్టాలిన్ వైపు మొగ్గడంతో డీఎంకే భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021 ఎన్నికలకు ముందే శశికళ రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కాగా నేడు ఆమె రజినీకాంత్ ని ఆయన నివాసంలో కలవడం చర్చనీయాంశం అయ్యింది. 

Also read షాకింగ్ న్యూస్... జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ టీం అవుట్.. కన్నీటి వీడ్కోలు చెప్పిన ముగ్గురు మిత్రులు
2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని రజినీకాంత్ (Rajinikanth)అనుకున్నారు. అనూహ్యంగా ఎన్నికలకు కొద్ది నెలల ముందు నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనకు పూర్తిగా చరమ గీతం పాడారు. అభిమానులు నానా యాగీ చేసినా.. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అంటూ.. ఇంటి ముందు ధర్నాలు చేసినా ఆయన నిర్ణయం మార్చుకోలేదు. ఇది దేవుని ఆదేశమంటూ మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్-శశికళ మధ్య చోటు చేసుకున్న ఈ మీటింగ్ వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, ఆమె మర్యాదపూర్వకంగా రజినీకాంత్ ని కలిశారని సమాచారం అందుతుంది. 

Also read Akhanda: ఎదిరించి నిలిచిన బాలయ్య...!

click me!