Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ US బాక్సాఫీస్ పరిస్దితి ఏమిటి!

By Surya PrakashFirst Published May 13, 2022, 12:30 PM IST
Highlights

మహేష్‌ను చాలా రోజుల తరువాత ఇలాంటి మాస్ అవతారంలో చూపించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ వారికి బాగా నచ్చుతోంది. పర్ఫార్మెన్స్ పరంగా మహేష్ తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. 


మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ హంగామా నిన్నటి నుంచి (మే 12) మొదలైంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీట వేశారు. ‘దూకుడు’ సినిమాలో హీరో, హీరోయిన్, వెన్నెల కిషోర్  మధ్య విదేశాల్లో తీసిన రొమాంటిక్ ట్రాక్ ఎలా మెప్పించిందో అలా ఇందులోనూ అమెరికాలో సాగే సీన్లు ఆకట్టుకుంటున్నాయి. మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగానే ఉండటం కలిసొచ్చే అంశం.

 సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రెండేళ్ల త‌ర్వాత స‌ర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, ప‌ర‌శురాం తెర‌కెక్కించారు. ఈ మూవీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఇక ‘సర్కారు వారి పాట’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర నిర్మాతలు సంబరాలు చేసుకున్నారు.
 
ఈ సినిమా  యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. హీరోగా మహేష్ బాబుకు అమెరికాలో 1 మిలియన్ క్రాస్ చేసిన చిత్రాల్లో 11వ ది కావటం విశేషం. యూఎస్‌లో ఎక్కువ 1.1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలదే అగ్ర స్థానం. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాకు వచ్చిన టాక్‌ను బట్టి రాబోయే రోజుల్లో ఈ సినిమా మొదటి రోజు మంచి షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. మరోవైపు యూఎస్.. ఇతర ఓవర్సీస్ లెక్కలు చూసుకుంటే.. ఈ సినిమా మొదటి రోజు రూ. 50 కోట్ల షేర్.. (రూ. 80 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఇక వీకెండ్స్ కి ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుందో లాంగ్ రన్ లో ఎక్కడ ఆగుతుందో లెక్కలు వేస్తోంది ట్రేడ్. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది.

click me!