చిరంజీవిని ప్రశాంతంగా ఉంచాలని, ఆయన దాకా సాధ్యమైనంతవరకూ ఈ విషయాలు ఏమీ తీసుకెళ్లకూడదని రామ్ చరణ్ భావిస్తున్నారట. విదేశాల నుంచీ వచ్చీ రాగానే.. చిరంజీవి, ఆ నష్టాలకు అనుగుణంగా ‘సహాయక చర్యలు’ చేపడతారని ఎదురుచూస్తున్న వారికి ఇది ఓదార్పు విషయమే.
‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసిన దరిమిలా, చిరంజీవి ఎక్కడ.? సెటిల్మెంట్ ఎప్పుడూ అంటూ రచ్చ, చర్చ జరుగుతోంది. ఆచార్య డిస్ట్రిబ్యూటర్లు దారుణమైన నష్టాల్ని చవిచూసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడాడు. వారిని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తనవంతుగా సాయం చేయడానికి కొరటాల ముందుకొచ్చాడు. అలాగే తన తండ్రి కు బదులుగా రామ్ చరణ్ ఈ సెటిల్మెంట్ తాను చేస్తానని మాట్లాడుతున్నారట.
ఇప్పటికే, ‘ఆచార్య’ నష్టాల విషయమై ఓ టీమ్ అంచనా వేస్తోందనీ, మెగాస్టార్ చిరంజీవి.. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారనీ చెప్తున్నారు. అయితే చిరంజీవిని ప్రశాంతంగా ఉంచాలని, ఆయన దాకా సాధ్యమైనంతవరకూ ఈ విషయాలు ఏమీ తీసుకెళ్లకూడదని రామ్ చరణ్ భావిస్తున్నారట. విదేశాల నుంచీ వచ్చీ రాగానే.. చిరంజీవి, ఆ నష్టాలకు అనుగుణంగా ‘సహాయక చర్యలు’ చేపడతారని ఎదురుచూస్తున్న వారికి ఇది ఓదార్పు విషయమే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నప్పటికీ, ఎప్పటికప్పుడు ‘ఆచార్య’ డిస్ట్రిబ్యూటర్లతో మంతనాలు జరుపుతూనే వున్నారట. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. అతను డిస్ట్రిబ్యూటర్లకు పూర్తి స్దాయి సెటిల్మెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ రామ్ చరణ్ వారికి కొంత ఉపశమనం కలిగించే ఆలోచనలో ఉన్నాడు.
అలాగే బయ్యర్లందరితో కొరటాల-నిరంజన్ మాట్లాడి, ఫైనల్ కంక్లూజన్ ని రామ్ చరణ్ కు చేరవేస్తారు. రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత బయ్యర్లకు వివిధ రూపాల్లో హామీ ఇస్తారు. కొందరికి డబ్బులు వెనక్కి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మరికొందరికి చిరంజీవి, రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాల రైట్స్ ను తక్కువలో అందించేలా హామీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇటు కొరటాల కూడా తన స్థాయిలో ఎన్టీఆర్ సినిమా రైట్స్ ఇప్పించేలా హామీ ఇస్తున్నాడు. ‘ఆచార్య’ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.