గ్రాండ్ గా ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. 105 మాస్ షార్ట్స్ తో రిలీజ్ కానున్న ట్రైలర్..

Published : May 01, 2022, 06:29 PM ISTUpdated : May 01, 2022, 07:56 PM IST
గ్రాండ్ గా ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. 105 మాస్ షార్ట్స్ తో రిలీజ్ కానున్న ట్రైలర్..

సారాంశం

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురాం పెట్ల కాంబినేషనల్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్ర ట్రైలర్ కోసం మేకర్స్ గ్రాండ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ట్రైలర్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండనున్నట్టు తెలిపారు.    

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకుడు పరుశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న  మాస్ అండ్ యాక్షన్ డ్రామా ‘సర్కారు వారి పాట’. చివరిగా మహేశ్ బాబు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఆడియెన్స్ ను, తన అభిమానులను అలరించాడు. రెండేండ్ల తర్వాత మళ్లీ Sarkaru Vaari Paataతో థియేటర్లలో సందడి చేయనున్నారు. సరిగ్గా పదిరోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 

ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. మరోవైపు వరుస అప్డేట్స్ అందిస్తూ అభిమానుల, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను అందించాారు. ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లోని మాస్ థియేటర్ భ్రమరాంబ 70 ఎంఎం వద్ద నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

అయితే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాకు లీక్ ల సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి బిగ్ అనౌన్స్ మెంట్ ను  అప్సెట్ చేస్తూ కొందరు  ఆ అప్డేట్స్ ను ముందుగానే లీక్ చేస్తున్నారు. ఈసారి కూడా ట్రైలర్ లోని ఓ షార్ట్ ను లీక్  చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది. కాగా, ఈ డ్యామేజ్ ను కవర్ చేసేందుకు సర్కారు వారి పాట టీం ట్రైలర్ కు సంబంధించిన మరో అప్డేట్ ను కూడా అందించింది. చిత్రంలో మహేశ్ బాబుకు సంబంధించిన మెంటర్ మాస్ స్వాగ్ తో కూడిన 105 షార్ట్స్ గల ట్రైలర్ ను లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు ఈ ట్రైలర్ లాంచ్ కానుంది.

 

ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆడిపాడింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే