వింత వ్యాధితో బాధపడుతున్న అమీర్ ఖాన్ కూతురు, అభిమానులకు ఎమోషనల్ నోట్ రాసిన ఐరా ఖాన్.

Published : May 01, 2022, 04:44 PM IST
వింత వ్యాధితో బాధపడుతున్న అమీర్ ఖాన్ కూతురు,  అభిమానులకు ఎమోషనల్ నోట్ రాసిన ఐరా ఖాన్.

సారాంశం

ఎంత డబ్బు ఉన్నా, సోషల్ స్టేటస్ ఉన్నా.. స్టార్ డమ్ ఉన్నా.. మనశ్శాంతి లేకుండా అన్నీ లేనట్టే.  ఆరోగ్యం లేకుండే అన్నీ ఉన్నా .. ఏమీ లేనట్టే.. ఇప్పుడు స్టార్ హీరో అమీర్ ఖాన్ , ఆయన కూతురు ఐరాపరిస్థితి కూడా అలాగే ఉంది పాపం. 

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఓ మాయదారి వ్యాధితో బాధపడుతోందట. ఆ రోగం తనను పట్టి పీడిస్తోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఇవాళ తనకున్న వ్యాధి గురించి అభిమానులతో పంచుకుంది. ఓ భారీ ఎమోషనల్ నోట్ ను కూడా రిలీజ్ చేసింది ఐరా. అందులో ఆమె బాధను వివరంగా చెప్పుకొచ్చింది. 

ఇంతకీ ఐరాఖాన్ ను వెంటాడుతున్న రోగం ఏంటీ అంటే ఏడుపు రోగం.ఈ రోగం గురించి వివరిస్తూ.. ఆమె   చాలా బాధపడింది.                        నా మీద యాంగ్జైటీ దాడి చేస్తోంది. గతంలో ఎప్పుడూ నాకు యాంగ్జైటీ లేదు.. కానీ, ఇప్పుడు పట్టుకుంది. దాని వల్ల చాలా ఉద్వేగానికి లోనవుతున్నా. క్ర‌ైయింగ్ ఫిట్స్ పట్టి చంపేస్తోంది అంటూ బాధను వెల్లబుచ్చింది. 

అంతే కాదు  భయానికి, భయం దాడికి మధ్య తేడా ఉన్నట్టే యాంగ్జైటీకి యాంగ్జైటీ ఎటాక్ కు మధ్య కూడా చిన్న తేడా ఉంది. యాంగ్జైటీ ఎటాక్స్ తో బయటకు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. హార్ట్ బీట్ సరిగ్గా ఉ ండదు.  ఊపిరితీసుకోలేకపోవడం, ఏడుపు.. ఇవి యాంగ్జైటీ ఎటాక్స్ లక్షణాలు. అవి చాలా నెమ్మదినెమ్మదిగా వస్తుంటాయి. పెరిగి పెద్దవుతాయి. ఏదో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది అని వివరంగా చెప్పింది. 

ఈ సమస్య తనకే ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదు అంటోంది ఐరా ఖాన్. అయితే, పానిక్ ఎటాక్ ఎలా ఉంటుందో మాత్రం నాకు తెలియదు. 2 నెలలకోసారి దీనికి గురయ్యే నేను.. ఇప్పుడు ప్రతిరోజూ దాని బారిన పడుతున్నా. తరచూ వస్తే కచ్చితంగా మానసిక నిపుణుడి వద్దకు వెళ్లాల్సిందేనంటోంది. 

నిద్రపోదామంటే.. నిద్ర అస్సలు పట్టిచావదు. ఆ యాంగ్జైటీ ఎటాక్ వదిలి చావదు. నా భయాలేంటో గుర్తించే పనిచేసినా ఉపయోగం లేదు. నాతో నేను మాట్లాడేసుకుంటున్నా. ఒకసారి అది ఎటాక్ చేసిందా.. దాని నుంచి తప్పించుకునే మార్గమే లేదు. నాకైతే అస్సలు ఏ మాత్రం అంతుపట్టడం లేదు. నాకే ఇది ఎందుకు జరుగుతుంది అని బాధతో  విలవిల్లాడిపోతోంది ఐరా ఖాన్. 

ఇది డెవలప్ అయ్యేటప్పుడే సమస్యను అడ్రస్ చేస్తే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. అద్దంలో మనల్ని మనం చూసి మాట్లాడుకోవడం, ఊపిరి తీసుకోవడం వంటి వాటి వల్ల సమస్యను దూరం చేసుకునే అవకాశం ఉంది. కనీసం కొన్ని గంటలైనా అది మన దగ్గరకు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ వచ్చే అవకాశమూ ఉంటుంది.  అంటూ తన సమస్యకు పరిష్కారం వెతుక్కుంటుంది ఐరా. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా