Sarkaru Vaari Paata Leaked: రిలీజ్ కు ముందే లీక్ అయిన సర్కారు వారి ‘పాట’... తట్టుకోలేక తమన్ ఏమన్నాడంటే...?

Published : Feb 13, 2022, 08:10 AM IST
Sarkaru Vaari Paata Leaked: రిలీజ్ కు ముందే లీక్ అయిన సర్కారు వారి ‘పాట’... తట్టుకోలేక తమన్ ఏమన్నాడంటే...?

సారాంశం

ఎంతో కష్టపడి.. స్టార్ హీరో సినిమ కోసం.. రేయింబవళ్ళు శ్రమించి ఓ పాట చేస్తే.. అది రిలీజ్ కు ముందే లీక్ అయితే ఎలా ఉంటుంది. గుండెలు పగిలిపోయేలా ఏడవాలని పిస్తుంది. ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్ట్ తమన్ ఆ పరిస్థితినే ఫేస్ చేస్తున్నారు.

ఎంతో కష్టపడి.. స్టార్ హీరో సినిమ కోసం.. రేయింబవళ్ళు శ్రమించి ఓ పాట చేస్తే.. అది రిలీజ్ కు ముందే లీక్ అయితే ఎలా ఉంటుంది. గుండెలు పగిలిపోయేలా ఏడవాలని పిస్తుంది. ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్ట్ తమన్ ఆ పరిస్థితినే ఫేస్ చేస్తున్నారు.

పైరసీల గురించి స్టార్లు సూపర్ స్టార్లు ఎన్ని చెప్పినా.. ఇండస్ట్రీ ఎంత పోరాట చేసినా.. జరిగేవి మాత్రం ఆగడం లేదు. కష్టపడ్డ సొమ్ము దొంగల పాలు అయినట్టు. ఎంతో కష్టపడి చేసిన సినిమా మెటీరియల్స్..రిలీజ్ కు ముందే నెట్టింట్లో దర్శనం ఇస్తుంటే.. బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం సర్కారువారి పాట మూవీ టీమ్ అదే బాధను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన హార్ట్ బ్రేక్అయ్యిందంటూ బాధతో ఆడియో కూడా రిలీజ్ చేశారు.

ఇంతకీ అసులు విషయానికి వస్తే. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు(Mahesh Babu) హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో నటిస్తోన్నసర్కారు వారి పాట సినిమా నుంచి వరుస లీకేజ్ లు మూవీ టీమ్ ను ఇబ్బంది పెడుతున్నాయి. గతంలో మూవీ టీజర్ లీక్‌ అయ్యింది. ఇఫ్పుడు ఏకంగా సాంగ్ కూడా లీక్ అయిపోయింది. వాలంటైన్స్ డే కోసం ఎంతో కష్టపడి సమకూర్చిన తమన్(Thaman) బాణీలను రిలీజ్ కుముందే నెట్టింట్లో పెట్టేశారు. రీసెంట్ గా కళావతి పాట ప్రోమో  రిలీజ్ చేశారు టీమ్. పాటను వాలంటైన్స్ డే రోజు పిబ్రవరి 14న రిలీ చేస్తామని కూడా ప్రకటించారు కాని ఇంతలోనే కళావతి పాట మొత్తం లీక్ కావడంతో మహేష్‌ బాబు(Mahesh Babu)అభిమానులు మండి పడుతున్నారు.

ఇక ఇదే విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) కూడా స్పందించాడు. ట్విట్టర్ లో తన బాధను ఆడియో రూపంలో రిలీజ్ చేశాడు. మనసైతే చాలా బాధగా ఉంది. ఆరు నెలలుగా ఈ పాట వీడియో కోసం ఎంతెతో కష్టపడ్డాం. రాత్రి, పగలు పని చేశాం.  ఈ పాట షూటింగ్‌ సమయంలో 9మందికి కరోనా పాజిటీవ్‌ కూడా వచ్చింది. మేము మా హీరోగారికి చూపించిల్సిన ప్రేమ, మా అబిమానం. మా పాటలో ఉండే ప్రాణం. మా కవి రాసిన అద్బుతమైన లిరిక్స్‌. మా డైరెక్టర్‌ గారు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా చేసిన లిరికల్‌ వీడియో. మేం ఎంతో హ్యాపీగా వరల్డ్‌లోనే బెస్ట్‌ ప్లేస్‌, మాస్టరింగ్‌, మిక్సింగ్‌ టెక్నాలజీ వాడాం ఈ పాట కోసం. అలా ఎంతో కష్టపడి తయారు చేసిన పాటను ఎవడో చాలా ఈజీగా నెట్‌లో పెట్టేశాడు.

 

ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాడికి పనిస్తే.. వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె తరుక్కుపోతోంది. కోపంగా వుండాలా, బాద పడాలా.. మూవ్‌ఆన్‌ అవ్వాలా తెలియట్లేదు. ఎంతో హార్ట్‌ బ్రేకింగా వుంది. నేను మామూలుగా ఇంత హార్ట్‌ బ్రేక్‌ అవ్వను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఎన్నో ఎదురుకున్నాను లైఫ్‌లో. నేనెందుకు పబ్లిక్‌ డొమైన్‌లో ఈ ఆడియో నోట్‌ పెడుతున్నానంటే వాడికి అర్దం కావాలి పైరసి అనేది ఎంత గోరమైన విషయమో వాడికి తెలియాలి అంటూ తమన్‌(Thaman) ట్వీట్‌ ద్వారా తన ఆవేదనను తెలిపాడు.

ఇక ఈ పాట లీక్ అయిన నేపథ్యంలో ఈ మూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా స్పందించారు.వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కావల్సిన  కళావతి పూర్తి పాటను.. ఈరోజు  అధికారికంగా యూట్యూబ్‌లో రిలీజ్ చేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?