
హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు యంగ్ స్టార్ శ్రీవిష్ణు(Sri Vishnu). ఎన్ని సినిమాలు చేసినా.. అవి ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లిపోతున్నాయి. కాని పెర్ఫామెన్స్ పరంగా మాత్రం విష్ణుకి మంచి మార్కులు పడుతున్నాయి.
శ్రీవిష్ణు(Sri Vishnu) హీరోగా..చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా భళా తందనాన. వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో, శ్రీవిష్ణు జోడీగా కేథరిన్ నటించింది. శ్రీకాంత్ విస్సా కథను అందించిన ఈ సినిమాకి మణిశర్మ బాణీలు సమకూర్చారు.
ఇక రీసెంట్ గా భళా తందనాన(Bhala Thandanana) సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్. రాశానిలా కనబడనీ ... వినబడనీ ప్రేమలేఖ. చూశానీలా కదలననే వదలననే మౌనరేఖ అంటూ సాగే అద్భుతమైన లిరిక్స్ కు శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి - రమ్య బెహ్రా ఇంకా అద్భుతంగా ఈ పాటను పాడారు.
లాస్ట్ టైమ్ శ్రీ విష్ణు(Sri Vishnu) హీరోగా వచ్చిన రాజ రాజ చోర ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ తరువాత రీసెంట్ గా వచ్చిన అర్జున ఫల్గుణ మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక కేథరీన్ విషయానికి వస్తే, వరల్డ్ ఫేమస్ లవర్ తరువాత కేథరిన్(Catherin Tressa) తెలుగు సినిమాలో కనిపించలేదు. ఆ సినిమా తరువాత ఈమె చేసిన సినిమా ఇదే. అందుకే ఈ ఇద్దరికి ఇప్పుడు హిట్ కొట్టడం చాలా అవసరం. మరి ఈసినిమా ఈ ఇద్దరు స్టార్లను నిలబెడుతుందా లేదా అనేది చూడాలి.