హీరో సంపూర్నేష్‌బాబు దాతృత్వం.. చిన్నారి హార్ట్ ఆపరేషన్‌ కోసం సాయం

Published : Feb 12, 2022, 10:10 PM IST
హీరో సంపూర్నేష్‌బాబు దాతృత్వం.. చిన్నారి హార్ట్ ఆపరేషన్‌ కోసం సాయం

సారాంశం

గతంలో ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం అందించి తనపెద్ద మనసుని చాటుకున్నారు సంపూర్నేష్‌బాబు. ఇప్పుడు మరోసారి ఆయన తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు.

టాలీవుడ్‌ సెన్సేషన్‌ హీరో సంపూర్నేష్‌బాబు(Sampoorneshbabu) మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ఆయన ఆపదలో ఉన్న పేద వారిని ఆదుకునేందుకు ముందే ఉంటారనే విషయం తెలిసిందే. గతంలో ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం అందించి తనపెద్ద మనసుని చాటుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. చిన్నారి హార్ట్ ఆపరేషన్‌ కోసం సంపూర్నేష్‌బాబు తన వంతు ఆర్థిక సాయాన్ని అందించారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా.. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన సంకొజి లావణ్య, రమేష్‌ దంపతుల రెండు నెలల బాబుకి హార్ట్ ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆ ఫ్యామిలీ కష్టం గురించి తెలుసుకున్న సంపూర్నేష్‌బాబు చిన్నారి హార్ట్ ఆపరేషన్‌ కోసం తనవంతుగా రూ. 25వేల ఆర్థిక సాయం అందించారు సంపూర్నేష్‌బాబు. ఆయన స్వయంగా లావణ్య, రమేష్‌ల ఇంటికెళ్లి మరీ తన ఆర్థిక సాయం అందజేయడం విశేషం. ఈ కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. దీంతో సంపూర్నేష్‌బాబుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇక `హృదయం కాలేయం` చిత్రంతో సంచలనం సృష్టించారు సంపూర్నేష్‌బాబు. స్పూప్‌ కామెడీతో ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత `సింగం 123`, `వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌`, `లచ్చిందేవికి ఓ లెక్కుంది`, `భద్రంః బీ కేర్‌ఫుల్‌`, `కొబ్బరిమట్ట`, కాలీఫ్లవర్‌` చిత్రాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన `బజార్‌ రౌడీ` తోపాటు మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతర చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు
Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు