Sarkaru Vaari Paata Leaked: రంగంలోకి మైత్రీ మేకర్స్.. వారిని పట్టుకుని, ఏం చేశారంటే.?

Published : Feb 13, 2022, 11:40 AM ISTUpdated : Feb 13, 2022, 11:46 AM IST
Sarkaru Vaari Paata Leaked: రంగంలోకి మైత్రీ మేకర్స్.. వారిని పట్టుకుని, ఏం చేశారంటే.?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన సర్కారు వారి పాట సినిమా నుంచి ఫస్ట్ సింగిల్  రిలీజ్ కాబోతుండగా.. ముందే లీక్ చేసి.. సాంగ్  మొత్తం నెట్ లో పెట్టిన విషయంలో తెలిసందే. ఈ విషయంలో రంగంలోకి దిగారు మైత్రీ మూవీ మేకర్స్. 

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన సర్కారు వారి పాట సినిమా నుంచి ఫస్ట్ సింగిల్  రిలీజ్ కాబోతుండగా.. ముందే లీక్ చేసి.. సాంగ్  మొత్తం నెట్ లో పెట్టిన విషయంలో తెలిసందే. ఈ విషయంలో రంగంలోకి దిగారు మైత్రీ మూవీ మేకర్స్.

అధికారికంగా విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది సర్కారువారి పాట (Sarkaru Vaari Paata) ఫస్ట్ సాంగ్. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు. సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఇంతో ఈ సాంగ్ నట్టింట్లో ప్రత్యక్షం అవ్వడంతో అంతా అవక్కయ్యారు. ఇక తమన్ అయినే ఈ బాధతట్టుకోలేక తన బాధతను తెలుపుతూ.. లాంగ్ ఆడియో రికార్డ్ ను ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు.  

దీంతో వెంటనే మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మేకర్స్ రంగంలోకి దిగింది. పాట లీకేజ్ కు సంబంధించిన వివరాలు సేకరించి.. దానికి బాధ్యులైన  ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాదు  ఇక పై మరోసారి అటువంటి లీక్‌లు జరగకుండా ఉండడానికి  కంటెంట్‌ భద్రతను కఠినతరం చేసినట్టు తెలుస్తోంది.

మహేష్ బాబు(Mahesh Babu)  హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్(Keerthi Suresh) హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన కళావతి సాంగ్ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది.  ఫిబ్రవరి 14న వాలంటైన్స్  డే రోజు అఫీషియల్ గా రిలీజ్ కావల్సిన ఈ సాంగ్ ను ఈరోజే యూట్యూబ్ లో రిలీజ్  చేయనున్నారు. ఇక ఈ  సాంగ్ ను సిద్ శ్రీరామ్ పాడగా.. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం