Ravi Teja 'Khiladi': వివాదంలో రవితేజ 'ఖిలాడీ'.. కేసు నమోదు చేసిన బాలీవుడ్ నిర్మాత

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 13, 2022, 11:23 AM IST
Ravi Teja 'Khiladi': వివాదంలో రవితేజ 'ఖిలాడీ'.. కేసు నమోదు చేసిన బాలీవుడ్ నిర్మాత

సారాంశం

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

తాజాగా ఖిలాడీ చిత్రానికి లీగల్స్ సమస్యలు మొదలయ్యాయి. బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ ఖిలాడీ చిత్రంపై కోర్టులో కేసు నమోదు చేశారు. 'ఖిలాడీ' టైటిల్ విషయంలో వివాదం మొదలైంది. ఖిలాడీ అనే పేరు వినగానే అక్షయ్ కుమార్ గుర్తుకు వస్తారు. 1992లో అక్షయ్ కుమార్ నటించిన ఖిలాడీ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ అక్షయ్ కుమార్ ని ఖిలాడీ హీరో అని పిలవడం ప్రారంభించారు. 

ఇదిలా ఉండగా రతన్ జైన్ మాట్లాడుతూ.. ఖిలాడీ అనే టైటిల్ పూర్తిగా అక్షయ్ కుమార్ సినిమాకు చెందినది. ఈ టైటిల్ పై అన్ని హక్కులు మాకే ఉన్నాయి. కావున రవితేజ ఖిలాడీ చిత్రాన్ని ఓటిటి, ఇతర డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో విడుదల కాకుండా అడ్డుకోవాలి అని కోర్టుని కోరారు. 

సౌత్ లో సినిమా టైటిల్స్ ని లోకల్ అసోసియేషన్స్ లో మాత్రమే రిజిస్టర్ చేస్తారు. కానీ అదే టైటిల్ తో హిందీలోకి డబ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు అని రతన్ జైన్ ఆరోపించారు. అందుకే రవితేజ ఖిలాడీ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. 

లోకల్ అసోసియేషన్స్ లో రిజిస్టర్ అయిన టైటిల్స్ తో దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ కు సిబిఎఫ్సీ అనుమతి ఇస్తోంది. ఇది సరైన విధానం కాదు అని ఆయన అన్నారు. దీనిపై ఖిలాడీ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్