
లతా మంగేష్కర్ మరణం దేశ ప్రజల్లో.. సినీ వర్గాల్లో తీవ్ర శూన్యతను మిగిల్చింది. చాలా మంది సెలబ్రిటీలు లెజెండరీ సింగర్‌కి హృదయపూర్వక నివాళులు అర్పించారు. ఆమెతో తమ అభిమాన క్షణాలను నెమరువేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా తనదైన రీతిలో లతా మంగేష్కర్ కు నివాళి అర్పించారు. లతాజీ పాడిన అత్యంత ప్రసిద్ధ పాటలలో ఒకటైన ‘లగ్ జా గాలే’పాటను ఆలపిస్తూ ఆమెను గుర్తు చేసుకున్నాడు.
లతా మంగేష్కర్ కరోనాకు గురై జనవరి 8న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్ప్రతిలో చేరినప్పటి నుంచి సల్మాన్ ఖాన్ ఆమె హెల్త్ కడిషన్ పై ఆరా తీస్తూనే వచ్చారు. చనిపోవడానికి ఒకరోజు ముందు కూడా సోషల్ మీడియాలో ఆమె కోలుకోవాలని దేవుడికి ప్రార్థనలు చేశారు. మరోవైపు యావత్ భారత్ కూడా లతాజీ కోలుకోవాలని ఆకాంక్షించారు. కానీ లెజెండరీ గాయని భువిని వదిలి నింగికెగిసింది. దీంతో కోట్లాది మందికి శోకసంద్రంలో మునిగి తేలారు. ఇప్పటికీ లతా మంగేష్కర్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
భాయిజాన్ కూడా లతాజీని గుర్తుచేసుకున్నారు. 1983లో రిలీజైన ‘వో జో హసీనా’మూవీ నుంచి విడుదలైన ‘లగ్ జా గలే’ సాంగ్ పాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నీలా ఏ ఒక్కరూ లేరు లతాజీ.. భవిష్యత్ లోనూ ఉండబోరు’ అంటూ లతా మంగేష్కర్ ను గుర్తు చేసుకున్నాడు. లతాజీ లేరనే చేదునిజాన్ని ఇప్పుడిప్పుడే సల్మాన్ జీర్ణించుకుంటున్నారు.
కాగా లతా మంగేష్కర్ 29 రోజుల పాటు కరోనాతో పోరాడి ఫిబ్రవరి 6న తుది
శ్వాస విడిచారు. ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM Modi), షారుక్ ఖాన్ (Shah Rukh Khan), సచిన్ టెండూల్కర్ ( Sachin) సహా పలువురు ప్రముఖులు భారతరత్న లతా జీకి నివాళులర్పించారు.