
మహేష్‌బాబు (Maheshbabu) నటిస్తున్న `సర్కారు వారి పాట` (Sarkaru Vaari Paata) చిత్రం నుంచి ఫిబ్రవరి 14న ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సాంగ్ పై ఆసక్తి పెంచేందుకు మేకర్స్ ఎప్పుడూ ఏదో క్రేజీ బజ్ ఇస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ సాంగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్, గ్లింప్స్ మాత్రమే విడుదలయ్యాయి. ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చారు. కానీ సాంగ్ విడుదలకు 17 రోజులు గ్యాప్ ఉండటంతో అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు. దీంతో ఫస్ట్ సింగిల్ పై ఆసక్తి పెంచేందుకు ఒక్కసారి రిలీజ్ డేట్.. మరోకసారి సాంగ్ టైటిల్, ఈ సారి సాంగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అసలు సంక్రాంతి సందర్భంగానే సర్‌ప్రైజ్ ఇవ్వాలని, ఓ పాటని విడుదల చేయాలని భావించారు. కానీ హీరో మహేష్‌కి కరోనా రావడం, అలాగే సంగీత దర్శకుడు థమన్ సైతం వైరస్ బారిన పడటంతో కుదరలేదు.
ఇప్పుడు ఆ వెయిటింగ్‌కి తెర దించారు. ఎట్టకేలకు ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేయబోతున్నారు. `కళావతి` పేరుతో వచ్చే పాటని విడుదల చేయనున్నట్టు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9 ఇస్తానన అప్డేట్ ప్రకారం సాంగ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ లో మహేశ్ బాబు కీర్తి సురేష్ వీపుపై హత్తుకుంటు ఉంటాడు. ఇందుకు హీరోయిన్ ప్రతిస్పందిస్తుంది. ఎంతో రోమాంటిక్ మూడ్ ను క్రియేట్ చేసేలా, హీరోహీరోయిన్ మధ్య లవ్ ను తెలియజేసేది పోస్టర్ కనిపిస్తోంది. ఈ క్లాస్టికల్ మెలోడీ సాంగ్ రిలీజైన తర్వాత అందరి హెడ్ ఫోన్స్ మొగిపోతాయని మూవీ మేకర్స్ చెబుతున్నారు.
మహేష్, కీర్తిసురేష్‌ల మధ్య వచ్చే లవ్ సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. అందరి హృదయాలను కొల్లగొట్టేలా ఉంటుందని తెలిపింది యూనిట్. మంచి మెలోడీ సాంగ్ అని తెలుస్తుంది. ఇక ఈచిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే 12న విడుదల చేయబోతున్నారు.