నేచురల్ స్టార్ నాని హీరోగా రేంజ్ పెరిగింది. `దసరా` నుంచి ఆయన మాస్ హీరోగా టర్న్ తీసుకున్నారు. ఆయన మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ఓటీటీ రైట్సే అందుకు నిదర్శనం.
నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో ఉన్నాడు. ఆయన నటించిన `దసరా` పెద్ద హిట్. నైజాంలో సక్సెస్ అయ్యింది. ఆంధ్రా, సీడెడ్‌లో పోయింది. ఇక `హాయ్ నాన్న` బలవంతంగా హిట్ అయ్యింది. డివైడ్ టాక్ వచ్చిన ఈ మూవీ నెమ్మదిగా సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. మొత్తంగా ఈ రెండు హిట్ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నాడు. `సరిపోదా శనివారం` అనే చిత్రంలో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలను రూపొందించిన వివేక్ ఆత్రేయ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
లవ్, ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్స్ మేళవిస్తూ సినిమాలు చేసి హిట్ కొట్టి వివేక్ ఇప్పుడు రూట్ మార్చి మాస్ మూవీ చేస్తున్నారు. `సరిపోదా శనివారం` అనే సినిమాని మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. చాలా కొత్తగా ఉంది. ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందుతుందని అర్థమవుతుంది. నాని హీరోగా నటించిన ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.
ఈ మూవీ ఈ సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటీటీ డీల్ సెట్ అయ్యిందట. భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతోపాటు అన్ని భాషలు కలిపి రూ.45కోట్లకి నెట్ ఫ్లిక్స్ ఈ ఓటీటీ రైట్స్ దక్కించుకుందని సమాచారం. ఇదే నిజమైతే నాని కెరీర్‌లోనే ఇది అత్యధికం కావడం విశేషం. నాని నటించిన గత చిత్రాలు `హాయ్ నాన్న` పది కోట్లకు, `దసరా` 33కోట్లకు అమ్ముడు పోయాయి. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది.
Read more: దర్శకుడిగా మారుతున్న స్టార్ విలన్.. పెద్ద బ్యానర్‌లో సినిమా..? హీరో ఎవరంటే?
Also read: Producer SKN : రవితేజ ‘ఈగల్’ను టార్గెట్ చేసిన నిర్మాత ఎస్కేఎన్ ? క్లారిటీ ఇచ్చిన నిర్మాత