Suma Kanakala : బిగ్ బాస్ సోహెల్ కు సుమ సాయం.. మంచు మనసు చాటుకున్న స్టార్ యాంకర్!

By Nuthi Srikanth  |  First Published Jan 29, 2024, 4:20 PM IST

స్టార్ యాంకర్ సుమ కనకాల Suma Kanakala మంచి మనస్సును చాటుకున్నారు. చిన్న సినిమాకు తనవంతు సహకారం అందించి సినిమాపై అభిమానం పెంచుకున్నారు. 


తెలుగు సినిమాల ఫంక్షన్లకు హోస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్నారు స్టార్ యాంకర్ కనకాల సుమ. భారీ చిత్రాల ఈవెంట్లను ఎంతో చక్కగా నిర్వహిస్తుంటారు. ఆమె అభిమానులు ముద్దుగా సుమక్క అని పిలుచుకుంటారు. ఇక సుమ కొడుకు రోషన్ కనకాల కూడా రీసెంట్ గా ‘బబుల్ గమ్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటకు ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇదిలా ఉంటే... సుమక్క ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. 

మొన్నటి వరకు కొడుకు సినిమాను ప్రమోట్ చేసిన సుమ తాజాగా మరో సినిమాకు తనవంతు సాయం చేసింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ Sohel స్వయంగా తెలిపారు. తన నెక్ట్స్ సినిమా బూట్ కట్ బాలరాజ్ Bootcut Balarajతో ప్రేక్షకుల ముందుకు రాన్నున్నాడు. ఈ సినిమాకు తానే ప్రొడ్యూసర్ కావడం విశేషం. దీంతో ఈ మూవీని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 2న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో సోహెల్ మాట్లాడుతూ.... ‘సుమక్క తమ సినిమాకు చాలా సాయం చేశారన్నారు.’ ఎలాగనో కూడా చెప్పుకొచ్చారు. 

Latest Videos

తన సినిమాను బాగా ప్రమోట్ చేయడంలో భాగంగా సుమతో  ఈవెంట్ నిర్వహించాలని భావించారు. ఇందుకు తమ వద్ద ఎక్కువ డబ్బులేకపోవడంతో సుమక్కకు తక్కువ మొత్తంలో చెల్లిస్తామని, తమ సినిమాను ప్రమోట్ చేయాలని కోరారు. ఈ మేరకు సుమ మేనేజర్ ను సంప్రదించారు. విషయం తెలుసుకున్న సుమ ఉచితంగానే తన సినిమాకు ప్రమోషన్ అందిస్తానని హామీనిచ్చారంట. ఇండస్ట్రీలో ఈ  స్థాయికి వచ్చి కూడా నీ సినిమాకు సాయం చేయలేనా అని భరోసానిచ్చారంట. ఈ విషయాన్ని సోహెల్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. 

ఇప్పటి వరకు ఎలాంటి నెగెటివిటీ లేని స్టార్ యాంకర్ సుమ ఇలా మంచి మనసును చాటుకోడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆమె సేవాగుణాన్ని అభినందిస్తున్నారు. ఇక ‘బూట్ కట్ బాలర్రాజు’ సినిమాను శ్రీ కోనేటి నిర్మించారు. గ్లోబల్ ఫిలిమ్స్, కథ వేరుంటాది బ్యానర్స్ పై రూపుదిద్దుకుంటోంది. మేఘ లేఖ హీరోయిన్.. సునీల్, సిరి హన్మంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.  

click me!