సెట్స్ లో అమ్మాయిల అందం చూసేవాడిని.. నా భార్యకి చెప్పేస్తుందేమో అని టెన్షన్: శరత్ కుమార్

Published : Jan 12, 2023, 09:03 PM IST
సెట్స్ లో అమ్మాయిల అందం చూసేవాడిని.. నా భార్యకి చెప్పేస్తుందేమో అని టెన్షన్: శరత్ కుమార్

సారాంశం

స్టార్ హీరో దళపతి విజయ్, రష్మిక మందన జంటగా నటించిన వారిసు చిత్రం బుధవారం రోజు తమిళంలో విడుదలయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు.

స్టార్ హీరో దళపతి విజయ్, రష్మిక మందన జంటగా నటించిన వారిసు చిత్రం బుధవారం రోజు తమిళంలో విడుదలయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో ఆల్రెడీ ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. 

తెలుగులో కూడా ప్రచార కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. తాజాగా దిల్ రాజు హైదరాబాద్ లో ప్రధాన నటీనటులు, చిత్ర యూనిట్ తో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాంత్, సీనియర్ నటుడు శరత్ కుమార్, జయసుధ, వంశీ పైడిపల్లి, దిల్ రాజు, తమన్ పాల్గొన్నారు. 

ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన శరత్ కుమార్ స్పీచ్ చాలా ఫన్నీగా సాగింది. దిల్ రాజు గారు దిల్ ఉన్న ప్రొడ్యూసర్ అని శరత్ కుమార్ ప్రశంసించారు. వంశీ పైడిపల్లి మంచి వ్యక్తి అని.. డెడికేషన్ ఉన్న దర్శకుడు అని కొనియాడారు. 

ఇక షూటింగ్ సమయంలో తాను చేసిన అల్లరి గురించి శరత్ కుమార్ సరాదాగా మాట్లాడారు. షూటింగ్ నా టెన్షన్ మొత్తం జయసుధ గారి గురించే. నేను అమ్మాయిలని చూస్తూ ఉండేవాడిని. జయసుధ గారు, నా వైఫ్ రాధిక మంచి స్నేహితులు. నా గురించి ఎక్కడ నా భార్యతో చెప్పేస్తుందో అని టెన్షన్. అందుకే కనిపించకుండా దూరంగా ఉండేవాడిని. 

ఒక మగాడిగా అమ్మాయిల అందం చూస్తే తప్పు లేదు. అందానికి మించి కావాలనుకుంటే తప్పు అని అన్నారు. శరత్ కుమార్ కామెంట్స్ కి జయసుధ నవ్వుతూ కనిపించారు. దిల్ రాజు గురించి కూడా ఫన్నీ కామెంట్స్ చేశారు. సంక్రాంతి తర్వాత దిల్ రాజు మా అందరికి మంచి రోలెక్స్ వాచ్ ఇస్తానని మాట ఇచ్చారు అని సరదాగా అన్నారు. దీనికి వెంటనే దిల్ రాజు.. అలాగే ఇస్తాను.. కానీ రేపు కూడా ప్రమోషన్స్ కి డేట్స్ ఇవ్వండి అని అడిగారు. బాబోయ్ కుదరదు అంటూ శరత్ కుమార్ అనడంతో నవ్వులు విరిశాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్