RRR కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. శిరస్సు వంచి పాదాభివందనాలు అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ మెసేజ్

Published : Jan 12, 2023, 08:05 PM IST
RRR కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. శిరస్సు వంచి పాదాభివందనాలు అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ మెసేజ్

సారాంశం

ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ చిత్రానికి ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అభిమానులకు థాంక్స్ చెబుతూ వీడియో సందేశం విడుదల చేశారు. 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై పెను ప్రభంజనం సృష్టిస్తోంది. నిన్ననే ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నాటు నాటు సాంగ్ కి గాను సంగీత దర్శకుడు కీరవాణికి ఈ అవార్డు లభించింది. 

దీనితో రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ సంతోషంతో ఎలా ఉప్పొంగిపోయారో చూశాం. కీరవాణి అయితే వేదికపై ఎమోషనల్ అయ్యారు. దేశవ్యాప్తంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల నుంచి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆర్ఆర్ చిత్రానికి ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అభిమానులకు థాంక్స్ చెబుతూ వీడియో సందేశం విడుదల చేశారు. 

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మీ అందరికి తెలుసు అమెరికాలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ప్రజాదరణ పొందిందో అని. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి కూడా రెండు విభాగాల్లో నామినేట్ ఐంది. అందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో కీరవాణి గారికి అవార్డు లభించింది. ఈ సందర్భంగా కీరవాణికి గారికి నా శుభాకాంక్షలు చెబుతున్నా. 

యూఎస్ తో పాటు జపాన్ లో కూడా ఈ చిత్రం ఇంతటి ప్రజాధారణ పొందింది అంటే అది అభిమానులు దీవెనల వల్లే. రాజమౌళి గారి కష్టం కూడా ఉంది. ఒక భారతీయ చిత్రం గా ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ కి ఆదరణ లభించింది. అందుకు అభిమానులందరికి శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేస్తున్నా. కీరవాణి గారు ఇండస్ట్రీకి ఎంతో అద్భుతమైన సంగీతం అందించారు. నా చిత్రాలకు కూడా ఎంత మంచి సంగీతం అందించారో అందరికి తెలిసిందే అని ఎన్టీఆర్ అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan: కరాటే టు సమురాయ్.. ఓజీ లింక్ తో పవన్ కళ్యాణ్ నుంచి భారీ ప్రకటన ?
ప్రభాస్ వర్సెస్ దళపతి విజయ్... 2026 ఫస్ట్ బిగ్ బాక్సాఫీస్ క్లాష్ లో సక్సెస్ ఎవరిది?