చిరు, బాలయ్య ఉన్నా మా ధైర్యం అదే.. ‘కళ్యాణం కమనీయం’ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

By team teluguFirst Published Jan 12, 2023, 7:14 PM IST
Highlights

యువ హీరో సంతోష్ శోభన్  ‘కళ్యాణం కమనీయం’తో జనవరి 14న అలరించనున్నాడు. ఈరోజు ‘వీరసింహారెడ్డి’ విడుదలైంది. రేపు ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా సంతోష్ తమ సినిమాపై ధీమా వ్యక్తం చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
 

వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Sobhan). గతేడాది ‘లైక్ షేర్ అండ్ సబ్ స్రైబ్’తో ఆకట్టుకున్నారు. తాజాగా నటిస్తున్న కొత్త సినిమా ‘కళ్యాణం కమనీయం’ Kalyan Kalaneeyam. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అదే రోజు దిల్ రాజ్ నిర్మించిన ‘వారసుడు’ కూడా తెలుగులో రిలీజ్ కాబోతుండటం విశేషం. 

రెండ్రోజుల్లో థియేటర్లలో అడుగుపెట్టబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా పెద్ద సినిమాలకు పోటీ వస్తున్న తమ సినిమా తప్పకుండా అలరిస్తుందని హీరో సంతోష్ శోభన్ ధీమా వ్యక్తం చేస్తూ   ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్రాంతికి పూర్తి కుటుంబ కథా చిత్రంగా మా "కళ్యాణం కమనీయం" విడుదలవుతుందన్నారు.  ఆహ్లాదకరమైన కంటెంట్ ఉన్న తమ సినిమాను సకుటుంబంగా థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తారన్నదే తమ ధైర్యం అన్నారు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలతో సంక్రాంతికి మళ్ళీ ఒక కళ వచ్చిందని తెలిపారు. వాళ్ళ సినిమాలతో పాటు తమ సినిమాకి కూడా ఈ అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నిర్మాతలు, చిత్ర యూనిట్, తోటి నటీనటులు అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారన్నారు. 

ఇక రీసెంట్ గానే చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రమని సెన్సార్ బృందం అభినందనలను తెలియజేసింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు వస్తుండటం ఆసక్తికరంగా మారింది. చిత్ర యూనిట్ కూడా అంతే ధైర్యంతో ముందుకెళ్తుండటంతో ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో చూడాలి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీగా కార్తిక్ ఘట్టమనేని, ఎడిటర్ గాసత్య జి వర్క్ చేశారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.  

click me!