Sara Tendulkar: నేను కూడా బాధితురాలినే, డీప్ ఫేక్ పై సారా టెండూల్కర్ సంచలన పోస్ట్.

By Mahesh JujjuriFirst Published Nov 23, 2023, 7:59 AM IST
Highlights

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది డీప్ ఫేక్ అంశం. రష్మిక మందన్న వీడియోతో వివాదం మొదలయ్యి.. పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ విషయంలో తాను కూడా బాధితురాలినే అంటోంది.. సంచిన్ కూతురు సారా టెండూల్కర్. 
 

ఫేక్ అకౌంట్లు, ఫేక్ మెసేజ్ లు, మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు.. ప్రస్తుతం సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన అంశం ఇదే. ఇది కాస్త ముదిరి స్టార్లపరువును తీస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది డీప్ ఫేక్ అంశం. ఇప్పటికే రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సంచలనం అవ్వగా.. స్టార్లంతా ఆమెకు అండగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విసయంలో స్పందించడం జరిగింది. ఇక ఇలాంటి అనుభవాలు తమకూ ఉన్నాయంటూ పంచుకుంటుననారు బాలీవుడ్ స్టార్స్. ఈక్రమంలో తన డీప్ ఫేక్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ సచిన్ కూతురు సారా టెండూల్కర్ కూడా  ఆరోపించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సార.

 ఎక్స్‌లో ఫక్  అకౌంట్లు క్రియేట్ చేసి.. అందరిని  తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ యాజమాన్యాన్ని కోరారు. తనకు ట్విటర్ (ఎక్స్)లో ఎలాంటి అకౌంట్ లేదన్న సారా టెండూల్కర్.. తన పేరిటిట రాంగ్ న్యూస్ ను వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక తన పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి డీప్ ఫేక్ ఫోటోలను షేర్ చేస్తున్నారని మండిపడింది. నకిలీ ఖాతాలపై.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Latest Videos

Animal: యానిమల్ సెన్సార్ కంప్లీట్, రన్ టైం రివీల్ చేసిన సందీప్ రెడ్డి, అన్ని గంటులు చూస్తారా..?

సారా పస్ట్ లో ఏముందంటే..? మన సంతోషాలు, బాధలు, రోజువారీ  ప్లాన్స్ ను  అందరితో పంచుకోవడానికి సోషల్ మీడియా ఒక అద్భుతమైన సాధనం. కానీ.. కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేయడం విస్తుగొలుపుతోంది. నాకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ ఫోటోలను చూశాను. అవి వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. అలాగే.. ఎక్స్‌లో నా పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించారు. ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఉద్దేశపూర్వకంగా వాటిని క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. నాకు ఎక్స్‌లో ఖాతా లేదు. నా పేరుపై ఉన్న నకిలీ ఖాతాలను పరిశీలించి, వాటిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆశిస్తున్నాను’’ అంటూ ఇన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సారా టెండూల్కర్ రాసుకొచ్చింది. 

అంతే కాదు వినోదం అనేది సత్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని.. నమ్మకం, వాస్తవికతపై ఆధారపడిన కమ్యూనికేషన్‌ను ప్రోత్సాహిద్దామని పోస్ట్ చివర్లో ఆమె సూచించారు. ప్రస్తుతం సారా టెండుల్కర్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్, సారా కలిసి ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి గిల్‌తో సారా కలిసి ఉన్నట్లు డీప్ ఫేక్ ఫోటోలను కొంతమంది సృష్టించారు.ఇక గత కొంత కాలంగా సారా టీమిండియా సెన్సేషనల్ క్రికెటర్  శుభ్‌మన్ గిల్‌తో  ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.  వన్డే ప్రపంచకప్‌తో పాటు టీమిండియా ఆడే మ్యాచ్‌లకు సారా టెండూల్కర్ హాజరుకావటం.. గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెమెరాను కూడా పదేపదే అటువైపు చూపించటంతో ఈ వార్తలు మరింత ఊపు అందుకున్నాయి. 

click me!