`రాధేశ్యామ్‌` టీజర్‌.. ప్రభాస్‌ బర్త్ డేకి మైండ్‌ బ్లోయింగ్‌ ట్రీట్‌.. బాబోయ్‌ గూస్‌ బమ్స్ తెప్పిస్తుందిగా

Published : Oct 23, 2021, 11:28 AM ISTUpdated : Oct 23, 2021, 11:30 AM IST
`రాధేశ్యామ్‌` టీజర్‌.. ప్రభాస్‌ బర్త్ డేకి మైండ్‌ బ్లోయింగ్‌ ట్రీట్‌.. బాబోయ్‌ గూస్‌ బమ్స్ తెప్పిస్తుందిగా

సారాంశం

ప్రభాస్‌ హీరోగా, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా శనివారం `రాధేశ్యామ్‌` టీజర్‌ని విడుదల చేశారు. 

ప్రభాస్‌(Prabhas) అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ వచ్చింది. వాళ్ల మతిపోగొట్టే గిఫ్ట్ వచ్చింది. Prabhasనటిస్తున్న `రాధేశ్యామ్‌`(Radheshyam Teaser) టీజర్‌ విడుదలైంది. ఆద్యంతం కనువిందుగా, ప్రభాస్‌ వాయిస్‌ ఓవర్‌తో సాగే ఈ టీజర్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. ఎవరూ ఊహించని కథతో సినిమా రూపొందుతుందనిపిస్తుంది. టీజర్‌ యూట్యూబ్‌తోపాటు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

ప్రభాస్‌ హీరోగా, పూజా హెగ్డే(Pooja hegde) జంటగా నటిస్తున్న చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా పాన్‌ ఇండియా స్టార్‌ Prabhas Birthday సందర్భంగా శనివారం `రాధేశ్యామ్‌` టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాధిత్యగా కనిపించబోతున్నారు. ఆయన గాంభీర్యమైన వాయిస్‌ ఓవర్‌తో సాగే టీజర్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. అభిమానులనే కాదు సాధారణ ఆడియెన్స్ ని కూడా మైండ్‌ బ్లాంక్‌ చేస్తుంది. 

టీజర్‌లో `నువ్వు ఎవరో నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. ప్రేమలో నీ మనసు ఎప్పుడూ విరిగిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు. కానీ చెప్పను. అన్నీ నాకు తెలుసు. కానీ చెప్పను. నీ ఆలోచనకు కూడా అందను. నా పేరు విక్రమాధిత్య. నేను దేవుడిని కాదు. మీలో ఒకడిని కూడా కాదు` అని అంటూ సాగే టీజర్‌ పిచ్చెక్కిస్తుంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఆకాశామే హద్దుగా మార్చేసింది. 

also read: ఆ విషయంలో అమితాబ్‌ బచ్చన్‌ని మించిపోయిన ప్రభాస్‌.. ఇండియన్‌ సినిమాకి `ఒకేఒక్కడు`.. అందుకు కారణం కూడా ఒక్కడే

టీజర్‌ని చూస్తుంటే ఇది పీరియాడికల్‌గా, పునర్జన్మ, ఆస్ట్రాలజీ, ప్రేమ ఇలా అనేక అంశాల మేళవింపుగా  సినిమా సాగుతుందని అర్థమవుతుంది.  కానీ కథ మాత్రం ఊహకందని విధంగా ఉంటుందని తెలుస్తుంది.  ఇక ఈ టీజర్‌లో వాయిస్‌ ఓవర్‌కి తగ్గట్టుగా వచ్చే విజువల్స్‌, ప్రభాస్‌ స్టయిలీష్‌ లుక్‌ కనువిందుగా ఉంది. ప్రభాస్‌ తన ఫ్యాన్స్ కి బెస్ట్ బర్త్ డే ట్రీట్‌గా ఉందీ టీజర్‌. అభిమానులు అసలైన పండగని ఈ రోజు చేసుకుంటున్నారని చెప్పొచ్చు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14 సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.

also read: HBD Prabhas: ప్రభాస్ జాతకం తిరగేస్తున్న జ్యోతిష్యులు.. ఎంజీఆర్, రజనీకాంత్ లాగే.. పెళ్లిపై అంచనా

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు