విజయ్ దేవరకొండకు పడిపోయిన మరో బాలీవుడ్ బ్యూటీ!

Published : Feb 14, 2021, 06:31 PM IST
విజయ్ దేవరకొండకు పడిపోయిన మరో బాలీవుడ్ బ్యూటీ!

సారాంశం

లైగర్ షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ ముంబై వెళ్లారు. షూటింగ్ సెట్స్ లో విజయ్ దేవరకొండను కలిసిన సారా అలీ ఖాన్ సెల్ఫీ దిగారు. విజయ్ దేవరకొండతో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకొని తన ఆనందం తెలియజేసింది ఆమె. ఇక లైగర్ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుండగా, విజయ్ ఫైటర్ రోల్ చేస్తున్నారు.

లక్ లాటరీలా తగిలింది విజయ్ దేవరకొండకు. పెళ్లిచూపులు సినిమాతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇక గీత గోవిందం విజయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకున్నారు ఆయన. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు సమానమైన స్టార్డమ్ విజయ్ దేవరకొండ కలిగిఉన్నారు.

విజయ్ దేవరకొండ పాపులారిటీ బాలీవుడ్ కి కూడా పాకింది. అలియా భట్, శ్రద్దా కపూర్, కియారా అద్వానీ లాంటి హీరోయిన్స్ టాలీవుడ్ నుండి విజయ్ దేవరకొండ తమ ఫేవరేట్ హీరో అంటూ చెప్పడం జరిగింది. కాగా ఈ లిస్ట్ లో మరో యంగ్ హీరోయిన్ వచ్చి చేరింది. స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ సైతం విజయ్ అంటే పడి చేస్తున్నారు.

లైగర్ షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ ముంబై వెళ్లారు. షూటింగ్ సెట్స్ లో విజయ్ దేవరకొండను కలిసిన సారా అలీ ఖాన్ సెల్ఫీ దిగారు. విజయ్ దేవరకొండతో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకొని తన ఆనందం తెలియజేసింది ఆమె. ఇక లైగర్ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుండగా, విజయ్ ఫైటర్ రోల్ చేస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?
Padma Awards 2026: మమ్ముట్టికి పద్మభూషణ్, ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. రొమాంటిక్ హీరోకి కూడా అవార్డు