షాకిస్తున్న చరణ్- శంకర్ మూవీ బడ్జెట్!

Published : Feb 14, 2021, 05:02 PM IST
షాకిస్తున్న చరణ్- శంకర్ మూవీ బడ్జెట్!

సారాంశం

సౌత్ ఇండియాలో మణిరత్నం తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. ఇంత వరకు ఆయన వేరే పరిశ్రమకు చెందిన హీరోలతో సినిమాలు చేయలేదు. అలాంటిది మొదటిసారి టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో మూవీ చేస్తున్నారు.  

భారత చలన చిత్ర సీమకు గ్రాండియర్ పరిచయం చేసిన దర్శకుడు శంకర్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు చరిత్ర సృష్టించాయి. సౌత్ ఇండియాలో మణిరత్నం తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. ఇంత వరకు ఆయన వేరే పరిశ్రమకు చెందిన హీరోలతో సినిమాలు చేయలేదు. అలాంటిది మొదటిసారి టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో మూవీ చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్  ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో మూవీపై అంచనాలు మరో స్థాయికి చేర్చారు. కాగా ఈ మూవీ బడ్జెట్ పై  టాలీవుడ్ లో అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. శంకర్ మరోమారు ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ సెట్ చేశాడట. ఈ మూవీ కోసం దర్శకుడు శంకర్ రూ. 150 కోట్ల అనుకుంటున్నారట.

మరి గతంలో దిల్ రాజు ఈ స్థాయిలో మూవీ తెరకెక్కించలేదు. దీనితో శంకర్ బడ్జెట్ దిల్ రాజు భరించగలడా అనే టాక్ ప్రచారం అవుతుంది. దేశం మెచ్చిన దర్శకులలో ఒకరైన శంకర్ తో మూవీ అనేసరికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చరణ్ నుండి ఓ భారీ చిత్రం రానుందని ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.

 

PREV
click me!

Recommended Stories

రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?