ధనుష్‌ `కర్ణన్‌`..ప్రేమికుల రోజు స్పెషల్‌..పవన్‌తో పోటీనా?

Published : Feb 14, 2021, 11:59 AM ISTUpdated : Feb 14, 2021, 12:01 PM IST
ధనుష్‌ `కర్ణన్‌`..ప్రేమికుల రోజు స్పెషల్‌..పవన్‌తో పోటీనా?

సారాంశం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు, స్టార్‌ హీరో ధనుష్‌ తన అభిమానులకు ట్రీట్‌ ఇచ్చారు. వాలెంటైన్స్ డే సందర్భంగా తాను నటిస్తున్న `కర్ణన్‌` చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. హరి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంది.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు, స్టార్‌ హీరో ధనుష్‌ తన అభిమానులకు ట్రీట్‌ ఇచ్చారు. వాలెంటైన్స్ డే సందర్భంగా తాను నటిస్తున్న `కర్ణన్‌` చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. హరి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంది. రక్తంతో తడిసిన చేతికి బేడీలు, తలకి గాయంతో రక్త కారుతుండగా, కోపం, ఆవేశం కలగలిపిన లుక్‌లో ధనుష్‌ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని నిర్మాత కలైపులి ఎస్‌ థాను, దర్శకులు సెల్వరాజ్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. 

దర్శకుడు సెల్వరాజ్‌ చెబుతూ, `న్యాయంలోని ఆత్మ ఎప్పటికీ మరణించదు` అని పేర్కొన్నారు. ఇది బానిస సంకెళ్లలో మగ్గుతున్న, అణచివేతకు గురవుతున్న ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో సాగుతుందని తాజా పోస్టర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. తాజాగా ఈ లుక్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడమే కాదు ట్రెండ్‌ అవుతుంది. మరోవైపు ఈ చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఏప్రిల్‌ 9న విడుదల చేయబోతున్నారు. ఇది తెలుగులో పవన్‌ సినిమా `వకీల్‌సాబ్‌`తో ఈ చిత్రం పోటీపడుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాని వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది