ప్రియా ప్రకాశ్ వారియర్ కాదు....సారాకే ఓటు

Published : Mar 20, 2018, 01:21 PM ISTUpdated : Mar 25, 2018, 05:28 PM IST
ప్రియా ప్రకాశ్ వారియర్ కాదు....సారాకే ఓటు

సారాంశం

'సింబా'లో ప్రియా ప్రకాశ్ వారియర్ అంటూ ఇన్నాళ్లూ వార్తలు కథానాయికగా సారా అలీఖాన్ ఎంపిక  సోషల్ మీడియా మాధ్యమంగా ప్రకటించిన దర్శక, నిర్మాతలు

టాలీవుడ్‌ లో మంచి విజయం సాధించిన 'టెంపర్' సినిమాను బాలీవుడ్ లో 'సింబా' పేరిట రణ్‌ వీర్‌ సింగ్‌ తో రోహిత్ శెట్టి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కరణ్ జోహర్ నిర్మాత కావడంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సోషల్ మీడియా సంచలనం ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో నటించనుందంటూ గతంలో పలు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. 

వీటన్నింటినీ రూమర్స్ గా కొట్టిపడేసిన చిత్రయూనిట్ ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ను ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఈ మేరకు రోహిత్‌ శెట్టి, కరణ్‌ జోహార్‌ లు ఆమెతో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కాగా, సారా అలీఖాన్ ‘కేదార్‌ నాథ్‌’ సినిమాతో బాలీవుడ్‌ అరంగేట్రం చేయనుంది.  

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి