సోనూసూద్‌కి పద్మ అవార్డు కోరిన బ్రహ్మాజీ.. రియల్‌ హీరో రియాక్షనేంటో తెలుసా?

By Aithagoni RajuFirst Published Jun 11, 2021, 4:50 PM IST
Highlights

సోనూ సూద్‌కి పద్మ విభూషణ్‌ పురస్కారం ఇవ్వాలంటూ తాను గట్టిగా కోరుకుంటున్నట్టు ట్వీట్‌ చేశాడు బ్రహ్మాజీ. తన ప్రతిపాదనను సమర్ధించే వారంతా ట్వీట్లకి రీ ట్వీట్లు చేయాలని తెలిపారు. దీంతో రీట్విట్లతో ట్విట్టర్‌ మోగిపోతుంది. 
 

కరోనా కష్ట కాలంలో వేల మందిని ఆదుకుంటున్నారు సోనూ సూద్‌. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా రియల్‌ హీరో అయ్యారు. తాజాగా సోనూ సూద్‌కి పద్మ విభూషణ్‌ పురస్కారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు నటుడు బ్రహ్మాజీ. `సోనూ సూద్‌కి పద్మ విభూషణ్‌ పురస్కారం ఇవ్వాలంటూ తాను గట్టిగా కోరుకుంటున్నట్టు ట్వీట్‌ చేశాడు బ్రహ్మాజీ. తన ప్రతిపాదనను సమర్ధించే వారంతా ట్వీట్లకి రీ ట్వీట్లు చేయాలని తెలిపారు. దీంతో రీట్విట్లతో ట్విట్టర్‌ మోగిపోతుంది. 

ఇదిలా దీనిపై సోనూ సూద్‌ స్పందించారు. ఆయన స్పందన ఇప్పుడు ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తుంది. `135కోట్ల మంది భారతీయుల ప్రేమ, అభిమానమే పెద్ద అవార్డు బ్రదర్‌. దానిని ఇప్పటికే పొందాను. మీ అభిమానానికి ధన్యవాదాలు‌` అని తెలిపారు సోనూ సూద్‌. 

ప‌ద్మ అవార్డుల‌కు పేర్ల‌ను సిఫార్స్ చేయ‌మంటూ కేంద్రం కోరుతుందని పీటీఐ  వెల్లడించింది. భార‌త‌దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలు ప‌ద్మ విభూష‌ణ్, ప‌ద్మ‌భూష‌న్‌, ప‌ద్మ‌శ్రీ నామినేష్ల‌న స్వీక‌ర‌ణ‌కు సెప్టెంబ‌ర్ 15వ‌ తేదీని చివరి తేదీగా తెలిపింది. దీంతో కరోనా మొదటి వేవ్‌నుంచి ఇప్పటికే తనదైన రీతిలో బాధితులను ఆదుకుంటున్న సోనూ సూద్‌కు పద్మ అవార్డు లభించాలంటూ కోరుకుంటున్నారు. కాగా కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు ఇలా వివిధ రంగాల్లో  విశిష్ట సేవ చేసినవారికి ఈ అత్యున్నత పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. 

ప్రతి సంవత్సరం మే 1, సెప్టెంబరు 15 తేదీలలో పద్మ పురస్కారానికి సంబంధించిన సిఫారసులను భారత ప్రధాని ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీకి సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26న రాష్ట్రపతి చేతులమీదుగా ఎంపిక చేసిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు. సోనూ సూద్‌ తెలుగులో `ఆచార్య` వంటి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. బ్రహ్మాజీ సైతం బిజీగా ఉన్నారు.

click me!