సంక్రాంతి రిలీజ్ లు RTC-X-Road మెయిన్ థియేటర్స్ లిస్ట్

Published : Jan 08, 2023, 11:11 AM IST
సంక్రాంతి రిలీజ్ లు  RTC-X-Road మెయిన్ థియేటర్స్  లిస్ట్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 12వ తేదీన, నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.  

 
పెద్ద  హీరో సినిమాలు విడుదలైనప్పుడు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కలెక్షన్స్ పై అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచీ సినిమా వాళ్లకు అదొక సెంటిమెంట్.అక్కడ బాగా కలెక్షన్స్ వచ్చాయంటే సినిమా సూపర్ హిట్ అని నమ్ముతూ ఉంటారు. కాబట్టి స్టార్ హీరోలు అభిమానులు తమ సినిమా రిలీజ్ లు ఆర్టీసి క్రాస్ రోడ్ లో ఏ థియోటర్ లో రిలీజ్ అవుతుందా అని ఎక్వైరీ చేస్తూంటారు.

సంక్రాంతి బరిలో వచ్చే సినిమాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 12వ తేదీన, నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలతో పాటు తమిళ హీరోలు అజిత్, విజయ్ సినిమాలు కూడా సంక్రాంతికే విడుదల కానున్నాయి.  అలాగే  సంక్రాంతి పెద్ద సినిమాలన్నీ విడుదల అయ్యాక జనవరి 14వ తేదీన ‘కళ్యాణం కమనీయం’ సినిమాను నిర్మాతలు విడుదల చేస్తున్నారు. 

అనిల్ కుమార్ ఆళ్ళ ‘కళ్యాణం కమనీయం’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యూవీ క్రియేషన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన ‘విద్య వాసుల అహం’ సినిమా కూడా జనవరి 14వ తేదీనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ బయటకు రాలేదు..  

 ఈ క్రమంలోనే కు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సంక్రాంతి సినిమాలు ఏ థియోటర్ లో  రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.

#Varasudu - సుదర్శన్ 35MM

#Thegimpu - సప్తగిరి

#VeeraSimhaReddy - సంధ్య  35MM

#WaltairVeerayya - సంధ్య  70MM

#KalyanamKamaneeyam - దేవి  70MM 

PREV
click me!

Recommended Stories

Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే
OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్