‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ కు మాస్ రెస్పాన్స్.. ‘వీరసింహారెడ్డి’తో పోల్చితే రెట్టింపు వ్యూస్!

Published : Jan 08, 2023, 11:03 AM ISTUpdated : Jan 08, 2023, 11:08 AM IST
‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ కు మాస్ రెస్పాన్స్.. ‘వీరసింహారెడ్డి’తో పోల్చితే రెట్టింపు వ్యూస్!

సారాంశం

సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ పెద్ద సినిమాల పోటీ షురూ అయ్యింది. వీరసింహారెడ్డి ట్రైలర్ విడుదలవ్వగా.. Waltair Veerayya Trailer తాజాగా రిలీజై మాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.   

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ `వాల్తేర్‌ వీరయ్య`. రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్‌, కేథరిన్‌ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ కు మాస్ రెస్పాన్స్ వస్తోంది. 

నిన్న రాత్రి 6 గంటలకు విడుదైన వీరయ్య ట్రైలర్ మాస్‌, ఫన్‌, యాక్షన్‌ మేళవింపుగా ఉంది. వింటేజ్ లుక్ లో చిరంజీవిని చూపించబోతున్నారు. చిరు కామెడీ, మాస్ యాంగిల్, రవితేజ - చిరు మధ్య సాగే సన్నివేశాలు, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం ఆకట్టుకుంటోంది. దీంతో యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంటోందీ ట్రైలర్. కేవలం 15 గంటల్లోనే 10 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 400 ప్లస్ లైక్స్ ను దక్కించుకుంది. ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో థియేటర్లు బద్దలే అంటున్నారు. 

సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాల నుంచి ట్రైలర్ విడుదల కావడంతో పోటీ షురూ అయ్యింది. అయితే ‘వీరసింహారెడ్డి’కి 14 గంటల్లో కేవలం 5 మిలియన్స్ వ్యూసే దక్కాయి. ఈ రకంగా వీరయ్య క్రేజ్ ఎంతగా ఉందో అర్థం అవుతోంది. ఇక ఈరోజు సాయంత్రం వైజాగ్ లోని ఏయూ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. మొన్ననే ‘వీరసింహారెడ్డి’ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. జనవరి 12 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్క రోజు తేడాతో ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలో విడుదల కానుంది.

 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే