విడుదలరోజే పైరసీ: 'సంజు'కి పెద్ద దెబ్బే!

Published : Jun 29, 2018, 04:58 PM IST
విడుదలరోజే పైరసీ: 'సంజు'కి పెద్ద దెబ్బే!

సారాంశం

బాలీవుడ్ ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తోన్న చిత్రం 'సంజు'. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం 

బాలీవుడ్ ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తోన్న చిత్రం 'సంజు'. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాకు హిట్ టాక్ వచ్చిందని సంబరపడేలోపే మేకర్స్ కు పెద్ద షాక్ తగిలింది.

ఉదయం విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉండడం షాక్ కు గురి చేసింది. అది కూడా హెచ్.డి ప్రింట్ కావడం గమనార్హం. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్ లైన్ లో కనిపించడం భారీ నష్టాలను కలిగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా లీక్ అవ్వడం పట్ల రన్ బీర్ కపూర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి లింక్ ను ఎవరికీ షేర్ చేయొద్దని కామెంట్లు పెడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Kriti Sanon: చెల్లి పెళ్లి వేడుకలో కృతి సనన్ డ్యాన్స్ చూశారా, దుమ్ములేచిపోయేలా చిందులు, వైరల్
MSG Ticket Price: మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు ఇవే.. తెలంగాణలో ఈ సినిమా చూడాలంటే ఫ్యామిలీలకు చుక్కలే