#Pushpa2: ‘పుష్ప2’ లో జాహ్నవి, సంజయ్ దత్ ? నిజం ఇదే

Published : Mar 09, 2024, 02:42 PM IST
   #Pushpa2: ‘పుష్ప2’ లో జాహ్నవి, సంజయ్ దత్ ?  నిజం ఇదే

సారాంశం

పుష్ప 2 సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మరో కీలక పాత్ర కోసం సంజయ్ దత్ ను ...

దాదాపు సంవత్సర కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2(Pushpa 2)  కోసం తెలుగు ఆడియన్స్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా నుండి విడుదలైన వేర్ ఈజ్ పుష్ప అనే వీడియో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అప్పటినుండి ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్  మరింత పెరిగాయి.ఇక గత రెండు రోజుల నుంచి  పుష్ప 2 నుండి వినిపిస్తున్న మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. పుష్ప 2 మూవీలో మరో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నటించబోతున్నాడట. ఆ స్టార్ యాక్టర్ ఎవరో కాదు సంజయ్‌ దత్‌.  ఈ మూవీలో మరో కీలక పాత్ర కోసం సంజయ్ దత్ ను తీసుకున్నారట మేకర్స్ అనే  న్యూస్ నేషనల్ వైడ్ ట్రెండ్  అవుతోంది. అలాగే ఈ సినిమా శ్రీదేవి కుమార్తె జాహ్నవి స్పెషల్ డాన్స్ చేయబోతోందని అంటున్నారు. అయితే ఈ న్యూస్ లో నిజమెంత అంటే...

పుష్ప 2 టీమ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు... ఈ రెండు వార్తల్లో నిజమే లేదని తెలిసింది. అసలు దర్శకుడుకానీ నిర్మాత కానీ ఈ విషయమే డిస్కస్ చేయలేందున్నారు. అలాగే సంజయ్ దత్ ఇప్పటికే కేజీఎఫ్ 2, లియో, చేసేసారు. సౌత్ లో బాగా ఎక్సపోజ్ అయ్యారు కాబట్టి పుష్ప 2 టీమ్ ఎవరైనా స్పెషల్ రోల్ కు తీసుకోవాలనుకున్నారు వద్దనుకుంటారు. ఎవరైనా అంతకు మించిన  కొత్త బాలీవుడ్ స్టార్ తో ముందుకు వెళ్తారు అని చెప్తున్నారు. ఇక జాహ్నవిని అసలు టీమ్ అడగలదేని ఎటువటి స్పెషల్ సాంగ్ ఆమె సైన్ చేయలేదని చెప్తున్నారు. కాబట్టి ఈ రెండు వార్తలు బేస్ లెస్ రూమర్స్ అని కొట్టిపారేస్తున్నారు. 
 
ఇక పుష్ప 2 విషయానికి వస్తే ...ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే వ్యూహంతో నిర్మాణం చేపడుతున్నారు. ఫస్ట్ పార్ట్  సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్‌తోనూ, డైలాగ్‌తోనూ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఆ రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకునే కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్  తో తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి  పలు భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు నిర్మాతలు.  ఈ క్రమంలో కేవలం తెలుగు రెండు రాష్ట్రాల నుంచే 200 కోట్ల దాకా బిజినెస్ ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు  తెలుస్తోంది. RRR చిత్రం తెలుగులో రెండువందల కోట్లు బిజినెస్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 కూడా అలాగే చేయాలని లెక్కలేసుకుని నిర్మాతలు రంగంలోకి దిగినట్లు ఫిల్మ్ నగరవర్గాల సమాచారం. 
  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?