SaiPallavi Mass Dance: జపాన్‌లో తన ఊరమాస్‌ డాన్స్ తో దుమ్ములేపిన సాయిపల్లవి.. వైరల్‌..

Published : Mar 09, 2024, 01:58 PM IST
SaiPallavi Mass Dance: జపాన్‌లో తన ఊరమాస్‌ డాన్స్ తో దుమ్ములేపిన సాయిపల్లవి.. వైరల్‌..

సారాంశం

సాయిపల్లవి అంటే డాన్స్ కి కేరాఫ్‌. ఆమె డాన్సులు మ్యాచ్‌ చేయడం హీరోలకు చాలా కష్టమే. ఇప్పుడు ఏకంగా జపాన్‌లో తన ఊరమాస్‌ డాన్సుతో రెచ్చిపోయింది.   

లేడీ పవర్‌ స్టార్‌గా రాణిస్తుంది సాయి పల్లవి. అద్భుతమైన నటనతోపాటు మైండ్‌ బ్లాక్‌ చేసే డాన్సుతోనూ ఆకట్టుకుంటుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతూ `ఏక్‌దిన్‌` అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో అమీర్‌ ఖాన్‌ కొడుకు జునైద్‌ ఖాన్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. తన సొంత ప్రొడక్షన్‌ అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై ఈ మూవీ రూపొందుతుంది. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జపాన్‌లో జరుగుతుంది. గత కొన్ని రోజులుగా జపాన్‌లోని సప్పారో ప్రాంతంలో షూట్‌ చేశారు. జపాన్‌ షెడ్యూల్‌ తాజాగా పూర్తి చేసుకుంది. దీంతో టీమ్‌ అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందులో సాయిపల్లవి రెచ్చిపోయింది. టీమ్‌తో కలిసి డాన్సు చేసింది. అది మామూలు డాన్స్ కాదు, షారూఖ్‌ ఖాన్‌ `చెయ్య చెయ్య` పాటకి ఆమె డాన్సు చేయడం విశేషం. టీమ్‌ అందరిలోనూ ఒకే అమ్మాయి సాయిపల్లవి, కానీ ఊరమాస్‌ డాన్సుతో రెచ్చిపోయింది. టీమ్‌లో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడం అది ట్రెండ్‌ అవుతుంది. 

ఇక సాయిపల్లవి చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కంటెంట్‌ బాగున్న సినిమాలు, అందులోనూ తన పాత్ర కి ప్రయారిటీ ఉన్న చిత్రాలే చేస్తుంది. అందులో భాగంగా ఆమె చివరగా తెలుగులో `విరాట పర్వం` మూవీలో నటించింది. ఇది విమర్శకులను మెప్పించింది. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. ఇప్పుడు తెలుగులో నాగచైతన్యతో కలిసి `తండేల్‌` మూవీలో నటిస్తుంది. ఆంధ్రలోని ఓడరేవు ప్రాంతంలో జాలర్ల జీవితాల బ్యాక్‌ డ్రాప్‌లో సాగే మూవీ. ఇందులో చైతూకి జోడీగా చేస్తుంది సాయిపల్లవి. 

చందుమొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది పాన్‌ ఇండియా మూవీగా రాబోతుంది. ఇది దసరాకి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.  దీంతోపాటు తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి ఓ సినిమా చేస్తుంది. కమల్‌ హాసన్‌ ప్రొడక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. ఇలా తెలుగు, తమిళం, హిందీలో ఒక్కో మూవీతో బిజీగా ఉంది సాయిపల్లవి. 

read more: బాలయ్య, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా?.. ఇండస్ట్రీ మొత్తం దిగింది
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్