క్రేజీ న్యూస్.. రామ్ విలన్ గా సంజయ్ దత్.. పూరీ మార్క్ చూపిస్తున్నాడుగా..

Published : Jul 28, 2023, 03:25 PM IST
క్రేజీ న్యూస్..  రామ్ విలన్ గా సంజయ్ దత్.. పూరీ మార్క్ చూపిస్తున్నాడుగా..

సారాంశం

ఈమధ్య క్రేజీ కాంబినేన్లు ఎక్కువైపోయాయి. అందులోనే టాలీవుడ్, బాలీవుడ్ కలయికలో సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. తాజాగా అలాంటి కాంబినేషన్ ఒకటి తెరపై సందడిచేయబోతోంది.   

మాస్ ఇమేజ్ కోసం పాకులాడుతున్న లవర్ బాయ్ రామ్ పోతినేనికి.. కావల్సిన మాస్ ఇమేజ్ నో తీసుకవచ్చింది  ఇస్మార్ట్ శంకర్.  నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా  టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర రికార్డ్ ల మీద రికార్డ్ లు  సృష్టించింది. అప్పటి వరకు లవర్‌ బాయ్‌ పాత్రలతో మెప్పించిన రామ్‌.. ఒక్కసారిగా యాక్షన్‌ మోడ్‌లోకి దిగి తన యాక్షన్‌ ఏ రేంజ్‌లో ఉంటుందోనని చూపించాడు.  అంతే కాదు చాలా కాలంగా హిట్టు అనే మాటకు దూరం అయిన పూరీ జగన్నాథ్ కు సూపర్ హిట్ ఇచ్చి లైఫ్ ఇచ్చింది మూవీ. ఈ ఊపుతో రామ్, పూరీ ఇద్దరు రెచ్చిపోయి సినిమాలు చేశారు. కాని అవన్నీ ప్లాప్ లు గా నిలిచాయి.

ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. డబుల్‌ ఇస్మార్ట్‌ అంటూ పేరు పెట్టిన టీమ్.. రెండు వారాల కిందట సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేశారు.  ఈ సారి డబుల్‌ స్పీడ్‌తో కంబ్యాక్‌ ఇవ్వాలని కసితో ఉన్నాడు. లైగర్ తో బాగా దెబ్బతిని ఉన్న పూరీ.. డబుల్ ఇస్మార్ట్ ను గట్టిగా ప్లాన్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ ను ఊరమాస్ గా చూపించబోతున్నారట. దానికి తగ్గట్టుగానే విలన్ ను కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారట. 

అందుకేరామ్ కోసం బాలీవుడ్‌  స్టార్ నటుడు సంజయ్‌ దత్‌ ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సజయ్ దత్ విలన్ అయినా ఇందులో  కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.అంతే కాదు రీసెంట్ గా ఆయన షూటింగ్‌ సెట్లో అడుగుపెట్టినట్లు కొన్ని ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ఇందులో నిజమెంతుందో తెలియదు కాని.. ఈన్యూస్ సోషల్ మీడియాలో వైరట్ అవుతోంది. 

ఈ సీక్వెల్‌ సినిమాను కూడా పూరీ స్వీయ నిర్మాణంలో చార్మీతో కలిసి రూపొందిస్తున్నాడు. సీక్వెల్‌లో రామ్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటించనున్నట్లు టాక్‌. ఇక ఈ సారి మరింత మాస్‌గా, గ్రాండ్‌ స్కేల్‌లో పాన్‌ ఇండియా సినిమాగా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్