‘బ్రో’ రిలీజ్.. సుదర్శన్ థియేటర్ లో అకీరా నందన్.. ‘జూనియర్ పవన్’ అంటూ ఫ్యాన్స్ రచ్చ..

By Asianet News  |  First Published Jul 28, 2023, 11:52 AM IST

పవర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ‘బ్రో’ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొడుకు కూడా మూవీ చూసేందుకు సుదర్శన్ థియేటర్ కు వచ్చారు. 
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘బ్రో : ది అవతార్’ (BRO)  మూవీ ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. తమిళ చిత్రం ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన ట్వీటర్, ప్రీమియర్ టాక్ అద్భుతంగా ఉంది. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు. కాసేపట్లో మూవీ పూర్తి రివ్యూ కూడా  రానుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వింటేజ్ యాక్షన్ తో పాటు వన్ మ్యాన్ షోగా థియేటర్లు దద్దరిల్లుతున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొడుకు అకీరా నందన్ (Akira Nandan)  ‘బ్రో’ చిత్రం చూసేందుకు సుదర్శన్ థియేటర్ కు వచ్చారు. కాస్ట్లీ కారులో థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఆయన వెహికిల్ చుట్టూ పవన్ కళ్యాణ్ అభిమానులు చేరిపోయారు. ‘జూనియర్ పవర్ స్టార్’ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

Latest Videos

ఇక అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారని అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అకీరా ఆయా సందర్భాల్లో పవన్ స్టార్ ఫ్యాన్స్ కంట పడటంతో ఖుషీ అవుతున్నారు. ‘బ్రో’ చిత్రం చూసేందుకు రావడంతో మరింత సంతోషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

అప్పట్లలో వచ్చిన టాక్ ప్రకారం.. అకీరా నందన్ తర్వలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరిగింది. ‘ఓజీ’ సినిమాతోనే ప్రేక్షకులను అలరించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇప్పటికే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో అకీరా ఎంట్రీ ఎలా ఉంటుందనేది చూడాలి. 

 

Akira Nandan at Sudarshan !💥 pic.twitter.com/OEdAryEQYd

— MEGA FAMILY FANS (@MegaStarKTweets)
click me!