రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకోకుండా వదలనంటున్న సానియా

Published : Feb 07, 2017, 12:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకోకుండా వదలనంటున్న సానియా

సారాంశం

కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్న సానియా మీర్జా మనసులో మాట బైటపెట్టిన టెన్నిస్ స్టార్ రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకోవాలని ఉండేదంటున్న సానియా

భారత ఏస్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మరో ఛాన్స్ ఉంటే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకోవాలని ఉందని ఆశపడుతోంది . బాలీవుడ్ దర్శక దిగ్గజం కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొన్న సానియా మీర్జా రణ్ బీర్ కపూర్ గురించి వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది. కరణ్ షోలో పాల్గొన్న టెన్సిస్ తారను పలు ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు కరణ్ జోహార్.

 

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో నీకు ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయని కరణ్ అడిగిన ప్రశ్నకు అంతే ధీటుగా సమాధానం ఇచ్చింది సానియా . కెరీర్ లో భాగంగా ఎక్కడికెక్కడికో వెళుతుంటానని ఆ సమయంలో ఎవరెవరినో కలుస్తుంటానని అలా కలిసి ఉండవచ్చు తప్ప మరెలాంటి ఎఫైర్ లేదని తెలివిగా తప్పించుకుంది సానియా. 

 

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న టెన్నిస్ తార సానియా... ఎవరినైనా చంపాలనుందా అని కరణ్ అడిగితే... టక్కున షాహిద్ కపూర్ నే చంపాలనుందని చెప్పింది. ఇక పెళ్లి గురించి కరణ్ సంధించిన ఆసక్తికర ప్రశ్నలకు సానియా తనదైన సమాధానం చెప్పింది. ఎవరినైనా పెళ్లిచేసుకోవాలని ఉండేదా అని అడిగితే... ఇప్పుడు లేదు కానీ... మరో అవకాశం  అంటూ ఉంటే రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకోకుండా వదలనని చెప్పి షాక్ ఇచ్చింది సానియా మీర్జా. సరదా కాస్తా ఎటు దారితీస్తుందో ఏమో.. 

PREV
click me!

Recommended Stories

సౌత్ సినిమాలపై నోరు పారేసుకున్న హీరోయిన్, రాధికా ఆప్టే సంచలన కామెంట్స్ ..
5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?