ఒళ్ళు గగుర్పొడిచేలా 'యానిమల్' ఫస్ట్ లుక్.. రక్తంతో తడిచి ముద్దైన రణబీర్ కపూర్

By team teluguFirst Published Jan 1, 2023, 7:17 AM IST
Highlights

సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ మూవీ అందించి తన ప్రత్యేకత చాటుకున్నారు. దీనితో సందీప్ తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది.

సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ మూవీ అందించి తన ప్రత్యేకత చాటుకున్నారు. దీనితో సందీప్ తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యువత సందీప్ తెరకెక్కించబోయే చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సందీప్.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో యానిమల్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

న్యూ ఇయర్ కానుకగా యానిమల్ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఒళ్ళు గగుర్పొడిచేలా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రణబీర్ కపూర్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాడు. ఈ లుక్ కి అర్జున్ రెడ్డి షేడ్స్ ఉన్నప్పటికీ.. సందీప్ రెడ్డి మరో ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామా క్రియేట్ చేస్తున్నాడని అర్థం అవుతోంది. 

బాడీ మొత్తం రక్తంతో తడిచి, చంకలో గొడ్డలి పెట్టుకుని సిగరెట్ కాల్చుతూ రణబీర్ ఇస్తున్న ఫోజులు అమేజింగ్. ఫస్ట్ లుక్ లో రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ అదిరిపోయింది. చాకోలెట్ బాయ్ లా కనిపించే రణబీర్ ఇటీవల ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నాడు. 

మరోసారి సందీప్ రెడ్డి వంగా ఫస్ట్ లుక్ తోనే తన చిత్రానికి అటెన్షన్ తీసుకువచ్చాడు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేయనున్నారు. టిసిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అభిమానులంతా ఫస్ట్ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Presenting you the first look of ANIMAL. HAPPY NEW YEAR PEOPLE🙂 pic.twitter.com/zrsyaXqWVx

— Sandeep Reddy Vanga (@imvangasandeep)
click me!