సమంత 'యశోద'పై పరుచూరి కామెంట్స్.. ఆ హీరోయిన్ చేసుంటే ఇంకా పవర్ ఫుల్ గా ఉండేది

Published : Dec 31, 2022, 09:18 PM IST
సమంత 'యశోద'పై పరుచూరి కామెంట్స్.. ఆ హీరోయిన్ చేసుంటే ఇంకా పవర్ ఫుల్ గా ఉండేది

సారాంశం

సమంత నుంచి వచ్చిన మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం యశోద. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని మలుపులతో ప్రేక్షకులని ఆకట్టుకుంది.

సమంత నుంచి వచ్చిన మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం యశోద. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని మలుపులతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఎప్పుడూ ముందుండే సమంత.. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో కళ్ళు చెదిరేలా నటించింది. యశోద చిత్రంతో సమంత ఖాతాలో మరో హిట్ పడింది. 

మాయోసైటిస్ తో బాధపడుతూ కూడా సామ్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. హరి అండ్ హరీష్ ద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజగా సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

పురిటి పిల్లల ప్లాస్మాతో కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారం చేయడం, దాని వెనుక ఒక పెద్ద మాఫియాని క్రియేట్ చేయడం బావుంది అని అన్నారు. తన చెల్లిని రక్షించుకునే ప్రయత్నంలో ఎంతో రిస్క్ చేసి సమంత ఈ మాఫియాని అంతమొందించడం చాలా బావుంది అని అన్నారు. సీక్రెట్ పోలీస్ ఏజెంట్ గా సమంత అద్భుతంగా నటించింది. 

అయితే అప్పట్లో ఇలాంటి పాత్రల్లో విజయశాంతి నటించేవారు. ఆమె బాడీ లాంగ్వేజ్ కి యశోద లాంటి చిత్రం బాగా సరిపోతుంది. అప్పట్లో విజయశాంతి ఇలాంటి చిత్రం చేసి ఉంటే ఇంకా పవర్ ఫుల్ గా ఉండేది అని పరుచూరి అన్నారు. సమంత కూడా అద్భుతంగా నటించింది అని అందుకే ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు అని పరుచూరి ప్రశంసించారు. 

కథలో సమంత తోటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ.. క్లైమాక్స్ భారం మొత్తం ఆమెపైనే వేయడం స్క్రీన్ ప్లేలో టెక్నిక్ అని చెప్పారు. కథలో పాత్రల పేర్లు ఎక్కువగా భాగవతంకి సంబంధించినవే అని పరుచూరి అన్నారు. హరి అండ్ హరీష్ మంచి కథ అందించారు అని ప్రశంసించారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..