
సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. 2023 సంక్రాంతికి తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలు నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమాలు, తమిళ స్టార్ హీరోలు నటించిన రెండు డబ్బింగ్ సినిమాలు, మరో రెండు చిన్న తెలుగు సినిమాలు వస్తున్నాయి. అమెరికాలో సైతం అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ నేపధ్యంలో మ్యూజిక్ డైరక్టర్ తమన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ , సంగీత దర్శకుడు తమన్ ది హిట్ కాంబినేషన్. అందులోనూ 'అఖండ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా. అందువల్ల, మ్యూజిక్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం మీద! తమన్ కూడా ఆ అంచనాలు మరింత పెంచేస్తున్నారు.
'అఖండ' సక్సెస్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్య భూమిక పోషించింది. థియేటర్లలో జనాలను ఒక ట్రాన్స్‌లోకి తీసుకు వెళ్ళిందనటంలో సందేహం లేదు. అయితే, అమెరికాలో కొంత మంది సౌండ్ ఎక్కువైందని కంప్లైంట్స్ చేశారు. బహుశా... ఆ విషయం తమన్ కు గుర్తిండిపోయినట్లుంది. దాంతో ఓ ట్వీట్ చేసారు.
''కలుద్దాం... దుమ్ము లేపుదాం! జై బాలయ్య. ఈసారి థియేటర్స్... దయచేసి కంప్లైంట్స్ చేయకండి. ప్రిపేర్ అవ్వండి'' అని తమన్ ట్వీట్ చేశారు.
'వీర సింహా రెడ్డి'కి కూడా తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని మీడియా వర్గాల టాక్. దర్శకుడు గోపీచంద్ మలినేని , తమన్ కాంబినేషన్ కూడా హిట్టే. మలినేని లాస్ట్ సినిమా 'క్రాక్'కు కూడా సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘క్రాక్’ ఫేం గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత గోపిచంద్ మలినేని, బాలయ్యతో సినిమా చేయనుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
జనవరి 11న అజిత్ 'తెగింపు', 12న బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి', విజయ్ 'వారసుడు', 13న చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటి తర్వాత జనవరి 14న 'విద్యా వాసుల అహం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ రోజునే 'కళ్యాణం కమనీయం' విడుదల కూడా!