మహేబాబుకు చెప్పిన కథ వేరే.. అది టూ వాయిలెంట్.. టైటిల్ కూడా చెప్పిన సందీప్ రెడ్డి వంగ

Published : Nov 27, 2023, 05:20 PM IST
మహేబాబుకు చెప్పిన కథ వేరే.. అది టూ వాయిలెంట్.. టైటిల్ కూడా చెప్పిన సందీప్ రెడ్డి వంగ

సారాంశం

మహేశ్ బాబుకు చెప్పిన కథ ‘యానిమల్’ అంటూ వస్తున్న వార్తలను సందీప్ రెడ్డి వంగ ఖండించారు. ఆ స్టోరీ టూ వాయిలెంట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. టైటిల్ ను కూడా రివీల్ చేశారు. 

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)  ‘అర్జున్ రెడ్డితో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే.  నెక్ట్స్ బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor)   తో  ‘యానిమల్’ (AnimalThe Film)ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో సందీప్ బిజీగా ఉన్నారు. మూవీ స్టార్ కాస్ట్ తో కలిసి సినిమాను గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. 

ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లో మూవీని బాగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో విలేకర్లతో ‘యానిమల్’ టీమ్ సమావేశమైంది. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మహేశ్ బాబు గురించి మాట్లాడారు. యానిమల్ కథనే మహేశ్ బాబుకు వినిపించారనే రూమర్లపై స్పందించారు.... మహేశ్ బాబుకు చెప్పిన కథ ఇది కాదు. అది టూ వాయిలెంట్ గా ఉంటుంది. ఈ కథ టైటిల్ డెవిల్. కానీ కుదరలేదు. అంతేకానీ మహేశ్ బాబు రిజెక్ట్ చేయలేదు. భవిష్యత్ లో ప్రాజెక్ట్ ఉంటుంది... అని చెప్పుకొచ్చారు. 

దీంతో మహేశ్ బాబుతో సినిమా పక్కా అని చెప్పుకొచ్చారు. అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సందీప్ డైరెక్షన్ లో మహేశ్ బాబును ఊహించుకుంటేనే నెక్ట్స్ లెవల్ ఫీలింగ్ ఉంటుందంటున్నారు. ప్రస్తుతం ‘యానిమల్’ ప్రేక్షకులను అలరించబోతోంది. డిసెంబర్ 1న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ అన్ని భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది