సుధీర్ బాబు ‘హరోం హర’ టీజర్ ను ఐదు భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు రిలీజ్ చేశారు. భారీ స్థాయిలో విడుదలైన ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సుధీర్ బాబు లుక్, తదితర అంశాలు నెక్ట్స్ లెవల్ అనిపించేలా ఉన్నాయి.
నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) నెక్ట్స్ ఫిల్మ్ ‘హరోం హర’ (Harom Hara). యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా క్రేజీ అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇదివరకే ఫస్ట్ లుక్ ను విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. తాజాగా టీజర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈరోజు విడుదల చేస్తానన్న టీజర్ ను ప్రభాస్ తెలుగులో లాంఛ్ చేశారు.
‘హరోం హర’ టీజర్ ను ఆయా భాషల్లో మమ్ముట్టి, టైగర్ ష్రాఫ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుధీప్ కూడా ఆవిష్కరించారు. టీజర్ విడుదలతో యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. ఇక టీజర్ విషయానికొస్తే... సుధీర్ బాబు చెప్పే ‘అందరు పవర్ కోసం గన్ పట్టుకుంటారు.. కానీ ఇది యాడాదో తిరిగి నన్ను పట్టుకోండి.. ఇది నాకేదో సెప్తా ఉంది.’ డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. మొదల్లో సుధీర్ చట్టవ్యతిరేకమైన పనులను చేయొద్దని భావించినా.. పరిస్థితులు మాత్రం అతని నిర్ణయాన్ని బ్రేక్ చేస్తూనే ఉంటాయి.
undefined
దీంతో ఆ పరిస్థితులతో సుధీర్ చేసే యుద్ధమే సినిమాగా తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా నటించిన మాళవిక శర్మ.. సుధీర్ స్నేహితురాలిగా కనిపిస్తుంది. జీవితంలో అతని ధైర్యం చెబుతూ ఉంటుంది. మొత్తానికి టీజర్ ఆకట్టుకునే కథనం, చెప్పుకోదగ్గ విజువల్స్, సాంకేతిక నైపుణ్యంతో గంభీరంగా ఉంది. రా అండ్ రాస్టిక్ గా ఆకట్టుకుంది. ముఖ్యంగా సుధీర్ బాబు అటిట్యూడ్, యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.
ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ కెమెరా, చైతన్ భరద్వాజ్ అద్భుతమైన స్కోర్ అందించారు. సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి నిర్మాణ విలువలు పటిష్టంగా ఉన్నాయని టీజర్ ద్వారా అర్థమవుతోంది. వచ్చే ఏడాది త్రైమాసికంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.