Bheemla Nayak :‘భీమ్లా’స్టేజీపై ‘జనసేన’ డైలాగ్స్! గమనించారా?

Surya Prakash   | Asianet News
Published : Feb 24, 2022, 07:31 AM IST
Bheemla Nayak :‘భీమ్లా’స్టేజీపై ‘జనసేన’ డైలాగ్స్! గమనించారా?

సారాంశం

”ఇల్లేమో దూరం.. అసలే చీకటి.. దారంతా గతుకులు.. చేతిలో దీపం లేదు.. కానీ నా ధైర్యమే కవచం.. నా ధైర్యమే ఆయుధం..” అని చెప్పి మీ అందరికి భీమ్లా నాయక్ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అని తెలిపింది.  


హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగిన భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ పంక్షన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా జరిగింది. సినిమా గురించి చాలా మంది మాట్లాడారు. అయితే అదే సమయంలో  ఈ స్టేజీ పైన ‘జనసేన’ డైలాగ్స్ మోత మోగాయి. అయితే ఇవి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ నోటి నుంచి వచ్చినవి కాదు. అందరూ ఆశ్చర్యపోయే  విధంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ సంయుక్త మీనన్ పలికింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల మాటలు పెద్దగా ఉండవు. అయితే  హీరోయిన్ సంయుక్త మీనన్ రికార్డ్ బ్రేకింగ్ స్పీచ్ ఇచ్చి అదరకొట్టింది. దాదాపు ఐదు నిమిషాలకు పైనే మాట్లాడి అందులో జనసేన డైలాగులు చెప్పి ఆశ్చర్యపరిచింది.

మొదట తెలుగులో స్పీచ్ మొదలుపెట్టింది. తర్వాత ఇంగ్లీష్. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా నుండి భీమ్లా నాయక్ వరకు చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగలేదు.  మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ మధ్యలో గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం అందుకుంది.  ‘జనసేన’ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన “ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, నా చేతిలో దీపం లేదు, కానీ నా ధైర్యం మీ కవచం, నా ధైర్యమే నా ఆయుధం” అంటూ చెప్పిన డైలాగ్స్ సంయుక్త చక్కగా పలికింది. ఊహించని ఈ పరిణామంతో ఫ్యాన్స్ కూడా సంయుక్త స్పీచ్ కు ఫిదా అయిపోయారు.
 
అప్పటికీ తమన్ అయితే తన కీ బోర్డ్ తో ఇక చాలు అనే సిగ్నల్స్ కూడా ఇచ్చాడు. చివరికి… మొత్తానికి, స్పీచ్ ఆపింది. సంయుక్త స్టేజ్ దిగాక మైక్ అందుకున్న సుమ.. ”ఈ అమ్మాయి ఇంత మాట్లాడాటానికి కారణం.. ఆ అమ్మాయిది మా ఊరే. మేము కొంచెం ఎక్కువే మాట్లాడతాం” అని నవ్వేసింది.  

 ఆమె ఏం మాట్లాడిందంటే....

”కేరళలో చిన్న ఊరిలో పుట్టి ఇక్కడ స్టేజి మీద మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. నాకు తెలుగు సినిమాలో ఇంతకన్నా బెస్ట్ ఇంట్రడ్యూస్ లేదు. చాలా ఎగ్జైట్ గా ఉంది ఈ సినిమాలో నటించినందుకు. నా క్యారెక్టర్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు. కానీ నేను భీమ్లా నాయక్ సినిమాలో పవన్ గారితో, రానా గారితో నటించినందుకు చాలా సాధించిన ఫీలింగ్ ఉంది. ఈ సినిమాతో సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు సపోర్ట్ చేసిన అందరు టెక్నీషియన్స్ కి చాలా థ్యాంక్స్. ఖుషి నుంచి పవన్ సర్ ని చూస్తూ పెరిగాను. బాహుబలి రానా గారితో, త్రివిక్రమ్ గారితో, అలవైకుంఠపురం సాంగ్స్ ఇప్పటికి వింటాను అలంటి పాటలు ఇచ్చిన తమన్ గారితో, కెమరామెన్ రవి చంద్రన్ గారితో కలిసి పని చేయడం అదృష్టం. మనం పెద్ద కలలు కనాలి వాటి కోసం కష్టపడాలి.” అని తెలిపింది.

”ఈ సినిమాకి నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను తెలుగులో. నా మొదటి సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. పవన్ గారు ఎప్పుడు ధైర్యం నింపుతారు నాలో. పవన్ గారు చెప్పిన మాటలు ఎప్పుడు వింటూ ఉంటాను.” అని పవన్ కళ్యాణ్ స్పీచ్ లలో ఎక్కువగా వినిపించే.. ”ఇల్లేమో దూరం.. అసలే చీకటి.. దారంతా గతుకులు.. చేతిలో దీపం లేదు.. కానీ నా ధైర్యమే కవచం.. నా ధైర్యమే ఆయుధం..” అని చెప్పి మీ అందరికి భీమ్లా నాయక్ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అని తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం