ఎన్టీఆర్ కి బాబాయ్ గా తమిళ నటుడు!

Published : May 01, 2019, 04:38 PM ISTUpdated : May 01, 2019, 04:39 PM IST
ఎన్టీఆర్ కి బాబాయ్ గా తమిళ నటుడు!

సారాంశం

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం 'RRR'.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం 'RRR'. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో తమిళ నటుడు సుముద్రఖనికి కూడా ఈ సినిమా అవకాశం దక్కింది. ఇటీవల ఆయన రాజమౌళితో కలిసి సెట్ లో తీసుకున్న ఫోటో ఒకటి బయటకొచ్చింది.

ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి బాబాయ్ గా సముద్రఖని కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ లో స్వాతంత్రకాంక్షను రగిల్చే వ్యక్తిగా సముద్రఖని తెరపై కనిపిస్తారు.

సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 24: విశ్వక్‌ను చితక్కొట్టిన ధీరజ్, కోపంతో భర్తను కొట్టిన ప్రేమ
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ అరెస్ట్ విషయంలో జ్యోపై అనుమానం- కార్తీక్ నిజం కనిపెడతాడా?