
అప్పట్లో భద్ర సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి మీరా జాస్మిన్ సౌత్ లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. అయితే కాలం గడుస్తున్నా కొద్దీ మెల్లగా ఇండస్ట్రీకి దూరమైన బేబీ 2014లో అనిల్‌జాన్ టైటిస్ అనే ఇంజినీర్‌ను పెళ్లి చేసుకొని దుబాయ్ కి ఎగిరిపోయింది.
పెళ్లి తరువాత ఆ మధ్య ఇండియాకు తిరిగొచ్చిన మీరా చెన్నైలో ఒక నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లింది. అప్పుడు ఆమె ఉన్న తీరుకు అందరూ షాకయ్యారు. ఎందుకంటే ఊహించని విధంగా మీరా లావెక్కింది. అసలు ఆమె మీరా జాస్మిన్ కాదని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇన్నాళ్లకు మళ్ళీ మీరా రీ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా ముంబైలో మలయాళం డైరెక్టర్ అరుణ్ గోపి మీరా జాస్మిన్ ని కలిశాడు. అక్కడ ఆమెతో కలిసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఒక్కసారిగా ఆ పిక్ వైరల్ అయ్యింది. ఫొటోలో మీరా చాలా నాజూగ్గా కనిపించింది. మళ్ళీ అమ్మడు సినిమాల్లోకి రానుందని అందుకే ఫిట్ నెస్ లో మార్పులు చేసినట్లు టాక్ వస్తోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో బేబీ ఏ తరహా పాత్రలను ఎంచుకుంటుందో చూడాలి.