‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి సముద్రఖని ఇంటెన్సివ్ లుక్.. అదిరిపోయిన పోస్టర్..

Published : Jul 14, 2022, 01:16 PM IST
‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి సముద్రఖని ఇంటెన్సివ్ లుక్.. అదిరిపోయిన పోస్టర్..

సారాంశం

యంగ్ హీరో నితిన్, కృతి శెట్టి  జంటగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyokavargam). ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా సముద్రఖని ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) మాస్ ఎంటర్ టైనర్ తో రాబోతున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. పక్కాగా కమర్షియల్ హిట్ కొట్టేందుకు నితిన్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా న్యూ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమైన ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలు అద్భుతంగా ఉన్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘రా రా రెడ్డి’ స్పెషల్ సాంగ్ కు ఆడియెన్స్ నుంచి మాసీవ్ రెస్పాన్స్ దక్కింది.

తాజాగా మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు సముద్రఖని (Samudrakhani) ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘రాజప్ప’ అనే పాత్రలో సముద్రఖని నటించబోతున్నారు. పొలిటీషన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విలన్ పాత్రలో మెప్పించిన సముద్రఖని ‘మాచర్ల నియోజకవర్గం’లొ రాజప్పగా దుమ్ములేపనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో సముద్రఖని ఇంటెన్సివ్ లుక్ ను సొంతం చేసుకున్నాడు. దాదాపు టాలీవుడ్ లోని పెద్ద సినిమాలకు సముద్రఖనినే విలన్ గా ఎంపిక చేస్తుండటం విశేషం. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’లోనూ సముద్రఖని విలన్ గా మెప్పించారు.  

ప్రస్తుతం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అదిరిపోయే అప్డేట్స్ తో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు. నితిన్  సొంత ప్రొడక్షన్ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై మూవీని నిర్మించారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు.  హీరోయిన్లు  Krithi Shetty, కేథరిన్ ట్రెసా నటిస్తున్నారు. ఆగష్టు 12న  థియేటర్లలోకి రానుంది. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా