ఆమూడ్ లేదు, జోకులొద్దు.. యాంకర్ శ్యామలపై సీరియస్ అయిన రామ్ గోపాల్ వర్మ

Published : Jul 14, 2022, 11:53 AM IST
ఆమూడ్  లేదు, జోకులొద్దు.. యాంకర్ శ్యామలపై సీరియస్ అయిన రామ్ గోపాల్ వర్మ

సారాంశం

రామ్ గోపాల్ వర్మకు కోపం వచ్చింది. అది కూడా ఏ స్టార్ హీరో మీదనో.. స్టార్ హీరోయిన్ మీదనో.. తన సినిమాలో నటిస్తున్నవారి మీదనో కాదు.. ఓ యాంకర్ మీద కోపం వచ్చింది. ఇక వర్మ స్టైల్ లో స్పందన ఎలా ఉంటుందో తెలుసు కదా..? 


సాధారణంగా ఆడియో ఫక్షన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అంటే యాంకర్ల హడావిడి ఎక్కువగా ఉంటుంది. వచ్చిన వారిని అలరించడానికి, గెస్ట్స్ లతో పాటు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక రీసెంట్ గా యాంకర్ శ్యామల ఇలాంటి ప్రయత్నమే చేసి ఇబ్బందుల్లో పడింది. అది కూడా రామ్ గోపాల్ వర్మ సినిమా ఈవెంట్ లో ఇదంతా జరిగింది. 

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మార్షల్ ఆర్ట్స్  బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన సినిమా లడ్కీ. పూజా భలేకర్  టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా  జూలై 15న  తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ మధ్య కొండ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆర్జీవి... ఏమాత్రం లేట్ చేయకుండా లడ్కీని  కూడా రిలీజ్ కు రెడీ చేశాడు. 

ఈ సినిమాలో బ్రూస్ లీని అభిమానించే పాత్రలో పూజా కనిపించనుంది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ కు పదును పెంచాడు వర్మ.  ఈ క్రమంలోనే  రాంగోపాల్ వర్మ టీమ్ హైదరాబాద్ లో అమ్మాయి ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ షోకి యాంకర్ శ్యామల హోస్ట్ గా వ్యవహరించింది. అందరు యాంకర్ల మాదిరిగానే శ్యామల కూడా ఈవెంట్ లో సరదాగా కొన్ని కొన్ని ఫన్ గేమ్స్ తో అలరించి ప్రయత్నం చేసింది. 

ఇక స్టేజిపై మాట్లాడటానికి వచ్చిన రామ్ గోపాల్  వర్మ.. మాట్లాడి దిగిపోతుండగా ఆపిన శ్యామల.. ఆయనతో కలిసి ఓ ఫన్ గేమ్ ఆడించే ప్రయత్నం చేసింది. కానీ మొదట పాజిటీవ్ గా స్పందించిన వర్మ.. ఆతరువాత కోపంగా ఫేస్ పెట్టి..  సినిమా విషయంలో సీరియస్ గా ఉన్నానని చెప్పి.. ప్రస్తుతం జోకులు కాదు.. ఎమోషన్.. సినిమాపై సీరియస్ నెస్ అంటూ.. స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం వర్మ శ్యామలపై సీరియస్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా