‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో సముద్ర ఖని లుక్ ఇదిగో

By Udaya DFirst Published Apr 11, 2019, 9:19 AM IST
Highlights

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. 

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఈ చిత్రంలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్, మెగాస్టార్‌ తనయుడు రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తమిళ నటుల్లో ఒకరైన సముద్రఖని ఓ కీలక పాత్రల్లో నటించనున్నారనే విషయం కూడా ప్రకటించేసారు.  ఈ సినిమా రెండో భారీ షెడ్యూల్‌ ఇటీవల ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లోనే సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. 

ఈ నేపధ్యంలో సముద్రఖని లుక్ ఈ సినిమాలో ఎలా ఉండబోతోందనేది బయిటకు వచ్చింది. ఇక్కడ ఫొటోలో మీరు చూడవచ్చు. ఇక తనకు ఈ ఆఫర్ ఎలా వచ్చిందనే విషయాన్ని సముద్రఖని ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సముద్ర ఖని మాట్లాడుతూ...‘నేను దర్శకత్వం వహించిన ‘నాడోడిగల్‌’ సినిమా చూసి రాజమౌళి సర్‌ నాకు ఓ పెద్ద మెసేజ్‌ పెట్టారు. అప్పటినుంచి నేను రాజమౌళి సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఇటీవల ఆయన నన్ను తన ఇంటికి ఆహ్వానించారు. తన కుటుంబీకుల్ని పరిచయం చేశారు. అప్పుడే నాకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా గురించి తెలిసింది. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది చేస్తావా? అని అడిగారు. నేను క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకున్నాను. అయితే ముందు ఆయన స్క్రిప్ట్‌ చదవాలని చెప్పారు. సరేనన్నాను’ అని వెల్లడించారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు రికార్డు స్థాయిలో రూ.132 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

click me!