ఓటు హక్కును వినియోగించుకున్న బన్నీ

Published : Apr 11, 2019, 08:26 AM ISTUpdated : Apr 11, 2019, 08:47 AM IST
ఓటు హక్కును వినియోగించుకున్న బన్నీ

సారాంశం

దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికల మొదటి అడుగు మొదలైంది. తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటి లానే సినీ తారలు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికల మొదటి అడుగు మొదలైంది. తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటి లానే సినీ తారలు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లో తన ఓటును వేశారు. 

ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే అంటూ.. అందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మనం ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుందని ఎవరు సమయాన్ని వృధా చేయకుండా బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ఇక  జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తల్లి, భార్యతో కలిసి ఉదయాన్నే ఓటు వేశారు. 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?