షూటింగ్ సెట్స్ లో సంపూర్ణేష్ బాబుకు ప్రమాదం(వీడియో)

Published : Jan 23, 2021, 02:22 PM IST
షూటింగ్ సెట్స్ లో సంపూర్ణేష్ బాబుకు ప్రమాదం(వీడియో)

సారాంశం

బజారు రౌడీ మూవీలో సంపూర్ణేష్ బాబు నటిస్తుండగా కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. పైనుండి బైక్ తాళ్ల సహాయంతో క్రిందికి దింపే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. దర్శకుడు వసంత నాగేశ్వర రావు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా,  సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.   

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు షూటింగ్ సెట్స్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన షూటింగ్ లో భాగంగా ఓ బైక్ పై స్టంట్స్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి క్రింద పడ్డారు. అయితే ఈ ప్రమాదంలో సంపూర్ణేష్ బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనితో చిత్ర యూనిట్ ఊపిరితీసుకున్నారట. వెంటనే సంపూర్ణేష్ బాబు షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. 

బజారు రౌడీ మూవీలో సంపూర్ణేష్ బాబు నటిస్తుండగా కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. పైనుండి బైక్ తాళ్ల సహాయంతో క్రిందికి దింపే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. దర్శకుడు వసంత నాగేశ్వర రావు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా,  సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. 

సంపూర్ణేష్ బాబు గత చిత్రం కొబ్బరి మట్ట మంచి విజయాన్ని అందుకుంది. కొబ్బరి మట్ట మూవీలో త్రిపాత్రాభినయం చేసిన సంపూర్ణేష్ బాబు తన మార్కు కామెడీతో ఆకట్టుకున్నారు. సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట మూవీతో మరలా ఫార్మ్ లోకి రాగా, ఆయనకు వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్