ఇండియాలనే ఆ ఘనత సాధించిన మొదటి హీరోయిన్ గా సమంత!

Published : Jan 23, 2021, 11:12 AM IST
ఇండియాలనే ఆ ఘనత సాధించిన మొదటి హీరోయిన్ గా సమంత!

సారాంశం

ఫ్యామిలీ మాన్ 2  కోసం ట్విట్టర్ ప్రత్యేకమైన ఈమోజీ విడుదల చేశారు. ఫ్యామిలీ మాన్ 2 మెయిన్ లీడ్  మనోజ్ బాజ్ పై, సమంతల తో కూడిన ట్విట్టర్ ఈమోజీ రూపొందించడం జరిగింది. ట్విట్టర్ క్యారెక్టర్ ఈమోజీ లో చోటు సంపాదించిన మొట్టమొదటి హీరోయిన్ గా సమంత రికార్డులకు ఎక్కారు.


టాలీవుడ్ లక్కీ లేడీ సమంత కెరీర్ లో ఒక్కొక్క మెట్టూ ఎదుగుతూ ముందుకు వెళుతున్నారు.  తాజాగా ఆమె పేరిట ఓ అరుదైన రికార్డు నమోదు అయ్యింది. ఇండియాలోనే ఆ ఘనత సాధించిన మొదటి హీరోయిన్ గా ఆమె రికార్డులకు ఎక్కారు. విషయంలోకి వెళితే. సమంత ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఓటిటి దిగ్గజం అమెజాన్  ప్రైమ్ లో ఫిబ్రవరి 12నుండి స్ట్రీమ్ కానుంది. 
దీనితో సమంత విరివిగా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 

కాగా ఫ్యామిలీ మాన్ 2  కోసం ట్విట్టర్ ప్రత్యేకమైన ఈమోజీ విడుదల చేశారు. ఫ్యామిలీ మాన్ 2 మెయిన్ లీడ్  మనోజ్ బాజ్ పై, సమంతల తో కూడిన ట్విట్టర్ ఈమోజీ రూపొందించడం జరిగింది. ట్విట్టర్ క్యారెక్టర్ ఈమోజీ లో చోటు సంపాదించిన మొట్టమొదటి హీరోయిన్ గా సమంత రికార్డులకు ఎక్కారు. ఇక ఫ్యామిలీ మాన్ 2 లో సమంత నెగెటివ్ షేడ్స్ కలిగిన టెర్రరిస్ట్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. 

సమంత ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో పాకిస్థాన్ కి చెందిన ముస్లిమ్ అమ్మాయిగా కనిపిస్తారట. ఇప్పటికే బయటికి కొచ్చిన సమంత డీ గ్లామర్ లుక్ సిరీస్ పై ఆసక్తి రేపుతోంది. మరో సౌత్ ఇండియన్ హీరోయిన్  ప్రియమణి ఈ సిరీస్ లో కీలక రోల్ చేస్తున్నారు. మనోజ్ బాజ్ పై భార్యగా ఆమె కనిపించనున్నారు. సమంత ఎంట్రీతో  ఫ్యామిలీ మాన్ 2 మొదటి సిరీస్ కి మించిన విజయం అందుకొనే అవకాశం కనిపిస్తుంది.  ఫ్యామిలీ మాన్ 2 కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. 
 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు